బుల్లితెరపై తనదైన శైలిలో ఆకట్టుకున్న కలర్ స్వాతి ఆ తర్వాత నెమ్మదిగా వెండితెరపై కూడా తనదైన శైలిలో చెరగని ముద్ర వేసుకుంది. అయితే కొన్ని చిత్రాలలో మాత్రమే నటించి పర్వాలేదు అనిపించుకుంది. కానీ తన కెరియర్ లో ఎక్కువ మెజారిటీ సినిమాలు నిరాశపరిచాయి. అయితే ఇతర భాషలలో సైతం ఈ ముద్దుగుమ్మకు మంచి పేరు దక్కింది. అలా నటిగా ఆఫర్లు వస్తున్న సమయంలోనే సినీ ఇండస్ట్రీకి దూరమై.. వివాహం చేసుకుని విదేశాలలో సెటిల్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం స్వాతి రీ ఎంట్రీ ఇచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
రెండు సంవత్సరాల క్రితమే కలర్స్ స్వాతి రీ ఎంట్రీ ఇవ్వాలని చాలా ఆశ పడింది. కానీ హీరోయిన్ గా ఒకటి, రెండు ఆఫర్ లు వస్తున్న సమయంలో కరోనా వల్ల అవి కూడా వాయిదా పడ్డాయి. దీంతో ఆమె నటిస్తున్న కొన్ని చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇక హీరోయిన్ గా స్వాతి మళ్లీ బిజీ అయ్యేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న పంచతంత్రం సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ ఉండడంతో త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
నటిగా రీఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్లు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది కలర్స్ స్వాతి. అయితే ఆమె ఆశలన్నీ ఎక్కువగా పంచతంత్రం సినిమాపైనే పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ ముద్దుగుమ్మ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో అనే విషయం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.. ఇండస్ట్రీలో నటిగా ఎన్నో సినిమాలలో నటించిన స్వాతి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుందని ఆమె అభిమానులు కూడా అనుకుంటున్నారు.. ఇక గతంలో ఎంత మంది హీరోయిన్లు సైతం బ్రేక్ తీసుకొని రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను కూడా అందుకున్నారు. ఇక ఇదే తరహాలో స్వాతి కూడా సక్సెస్ అందుకుంటుందో చూడాలి మరి.