యష్ ను వెంటాడుతున్న ప్రభాస్ కష్టాలు !

Seetha Sailaja
‘బాహుబలి 2’ తరువాత ప్రభాస్ ఇమేజ్ తారా స్థాయికి చేరిపోవడంతో అతడికి దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడి అతడు తీసుకునే పారితోషికం 100 కోట్ల స్థాయికి చేరుకుంది అంటారు. అయితే ఆతరువాత ప్రభాస్ కు అన్నీ కష్టాలే. అతడు నటించిన ‘సాహో’ ‘రాథే శ్యామ్’ సినిమాలు ఘోర పరాజయం చెందడంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.



ఇప్పుడు ఈ సమస్యలు ప్రస్తుతం రాకింగ్ స్టార్ గా దేశవ్యాప్తంగా లక్షలాది ప్రజల అభిమానాన్ని పొందుతున్న హీరో యష్ కు రాబోతోందా అంటూ కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం ‘కేజీ ఎఫ్ 2’ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో క్రియేట్ చేస్తున్న సంచలనాలు. ఈ సినిమా కలక్షన్స్ విషయంలో వరస రికార్డులు క్రియేట్ చేస్తూ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.



ఈ సినిమాకు మొదటిరోజు వచ్చిన కలక్షన్స్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తోంది. ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ యష్ ను ప్రజెంట్ చేసిన విధానం కథను టైట్ స్క్రీన్ ప్లేతో నడిపించిన తీరు సగటు ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ మూవీలో యష్ ఇంట్రడక్షన్ సీన్ నుండి అతడి పాత్రకు ఇచ్చిన ఎలివేషన్  ఈ సినిమా చాలమందికి నచ్చే విధంగా మార్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈసినిమా గురించి మాత్రమే చర్చలు జరుగుతున్నాయి.


కన్నడ హీరో యష్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోగా మారిపోయాడు. దీనితో ఈసినిమా తరువాత యష్ ఏసినిమాలో నటిస్తాడు అన్న ఆశక్తి అందరిలోనూ పెరిగిపోయింది. దీనితో యష్ తన తదుపరి సినిమా ఎంపిక విషయంలో ఏమాత్రం పొరపాట్లు చేసినా ప్రస్తుతం ప్రభాస్ కు కొనసాగుతున్న డల్ పిరియడ్ ఎదురయ్యే అవకాశం ఉంది అన్న హెచ్చరికలు వస్తున్నాయి. దీనితో యష్ తన తదుపరి సినిమాను ఏ ప్రముఖ దర్శకుడుతో చేస్తాడు అన్న విషయమై అనేక ఊహాగానాలు కొనసాగుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: