టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన రాజశేఖర్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజశేఖర్ తన సినిమా కెరియర్ లో ఎన్నో మంచి మంచి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రాజశేఖర్ తన ఇద్దరు కూతుళ్లను కూడా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇప్పించాడు. ఇప్పటికే రాజశేఖర్ ఇద్దరు కూతుర్లు కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇది ఇలా ఉంటే రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని మిస్ ఇండియా (2022) పోటీల్లో పాల్గొనబోతోంది.
ఈ విషయాన్ని శివాని రాజశేఖర్ స్వయంగా వెల్లడించింది. పోటీ లకు సంబంధించిన ఆడియన్స్ కు హాజరు అయినట్లు శివాని రాజశేఖర్ తెలియజేసింది. తన వంతుగా ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చాను అని శివాని రాజశేఖర్ చెప్పుకొచ్చింది. కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని, అందరి ఆశీర్వాదాలు కావాలని శివాని రాజశేఖర్ కోరింది. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫెమీనా సంస్థకు ధన్యవాదాలను ఈ నటి తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్న మహిళలకు శివాని రాజశేఖర్ ఆల్ ది బెస్ట్ చెప్పింది. అందాల పోటీల్లో పోటీ పడుతున్న శివాని రాజశేఖర్ కి పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఇలా ఉంటే శివాని రాజశేఖర్ 'అద్భుతం' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో శివాని రాజశేఖర్ నటనకు గాను ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శివాని రాజశేఖర్ రెండు తమిళ సినిమాల్లో నటిస్తోంది. అలాగే ఆహనా పెళ్ళంట అనే తెలుగు వెబ్ సిరీస్ లో కూడా శివాని రాజశేఖర్ నటిస్తోంది.