రామ్ చరణ్ కోసం మొక్కులు చెల్లించుకున్న ఉపాసన !

Seetha Sailaja

రామ్ చరణ్ భార్య ఉపాసన ఎంత మోడ్రన్ గా ఉంటుందో ఆధ్యాత్మిక విషయాలు వచ్చేసారికి అంత నియమ నిష్టలతో పూజలు చేస్తుంది. రామ్ చరణ్ కోసం తాను ఏమిచేసిన ఆవిషయాలకు సంబంధించిన ఫోటోలను వెంటనే ఆమె ఆఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం అవి వైరల్ గా మారడం పరిపాటి.


లేటెస్ట్ గా ఉపాసన అమృతసర్ లోని గోల్డెన్ టెంపుల్ కు వెళ్ళింది. అక్కడ తన భర్త చరణ్ కోసం ప్రార్థనలు చేసింది. ఈ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘చెర్రీ మీ తరఫున పూజలో పాల్గొనే అవకాశం తనకు లభించినది. నేను మీ ప్రేమతో ఆశీర్వదింపబడ్డాను’ అంటూ చేసిన కామెంట్స్ మెగా అభిమానుల మధ్య వైరల్ గా మారాయి.


వాస్తవానికి గోల్డెన్ టెంపుల్ లో జరిగిన ఈ ప్రత్యేక పూజకు ఉపాసన తో పాటు రామ్ చరణ్ కూడ వెళ్ళవలసి ఉన్నప్పటికీ చరణ్ శంకర్ దర్శకత్వంలో నిర్మింప బడుతున్న భారీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో ఉపాసన చరణ్ తరపున ఈ ప్రత్యేక పూజలు నిర్వహించింది. క్షణం తీరిక లేకుండా అపోకో ఫార్మసి బిజినెస్ వ్యవహారాలూ చక్కబెడుతు చరణ్ ఫామ్ హౌస్ లో ఎంతో అభిమానంగా పెంచుతున్న అనేక మూగ జీవాలను ఉపాసన తన సొంత పిల్లలుగా చూసుకుంటుంది.


‘ఆర్ ఆర్ ఆర్’ ఘన విజయం తరువాత చిరంజీవి చరణ్ లు కలిసి నటిస్తున్న ‘ఆచార్య’ మూవీ కూడ ఘన విజయాన్ని అందుకుంటే ఉపాసన మరిన్ని మొక్కులు తీర్చుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ‘ఆచార్య’ మూవీలోని చరణ్ జూనియర్ లు కలిసి స్టెప్స్ వేసిన పాటకు విపరీతమైన స్పందన రావడంతో మెగా అభిమానులు ఈ వారంతంలో జరగబోయే ‘ఆచార్య’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి పవన్ చరణ్ ల కలయిక కోసం ఆసక్తిగా ఎదురు మెగా అభిమానులు ఎంతో ఆశగా చూస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: