చిరంజీవి, రామ్ చరణ్ డాన్స్ చూడడానికి సెట్ కి రోజు అంతమంది దర్శక నిర్మాతలు వచ్చేవారు... శేఖర్ మాస్టర్..!

Pulgam Srinivas
సినీ ప్రేక్షకులకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎక్కువ పాటలకు కొరియోగ్రఫీ చేస్తున్న మాస్టర్ లలో శేఖర్ మాస్టర్ కూడా ఒకరు. శేఖర్ మాస్టర్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల పాటలకు కొరియోగ్రఫీ చేశాడు. ఇది ఇలా ఉంటే తాజాగా శేఖర్ మాస్టర్ మెగాస్టార్ చిరంజీవి,  హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా లోని 'భలే భలే బంజారే'  సాంగ్ కి కొరియోగ్రఫీ చేశాడు. ఈ సాంగ్ కి మెగాస్టార్ చిరంజీవి,  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి స్టెప్పులు వేశారు. ఈ సాంగ్ కి  శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఈ సాంగ్ గురించి శేఖర్ మాస్టర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.


 శేఖర్ మాస్టర్ భలే భలే బంజారే సాంగ్ గురించి మాట్లాడుతూ... చిరంజీవి ,   రామ్ చరణ్ కలిసి డాన్స్ చేస్తుంటే నిజంగా ఒక పండుగలా ఉంటుంది. ఆ డాన్స్ ను కంపోజ్ చేసే వరకూ నాకు నిద్ర పట్టలేదు అని శేఖర్ మాస్టర్ తెలియజేశాడు. ఆ సాంగ్ కి రిహార్సల్స్ తరువాత షూటింగ్ కి వెళ్లాము అని శేఖర్ మాస్టర్ అన్నారు. ఆ సాంగ్ షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు, చాలా మంది దర్శక నిర్మాతలు సెట్ కి వచ్చేవారు. చిరంజీవి గారు ,  రామ్ చరణ్ గారు కలిసి డాన్స్ చేస్తుంటే చూడ టానికి రోజుకి  20 మంది కి పైగా దర్శక నిర్మాతలు వచ్చేవారు. ఇంత మంది దర్శక నిర్మాతలు ఒక సెట్ కి తరలిరావడమనేది ఈ సాంగ్ విషయం లోనే జరిగిందేమో అని శేఖర్ మాస్టర్ తాజా ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: