యూట్యూబ్ లో దూసుకుపోతున్న 'భలే భలే బంజారా' సాంగ్..!

Pulgam Srinivas
చిరంజీవి తాజాగా ఆచార్య సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే.  ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు.  ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించింది.  ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.  ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది.  ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు నక్సలైట్ లుగా కనిపించబోతున్నారు.  ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఈ సినిమాను ఏప్రిల్ 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది.


  ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించాడు.  ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పాటలను విడుదల చేయగా ఈ పాటలకు నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.  ఇది ఇలా ఉంటే తాజాగా ఆచార్య మూవీ నుండి చిత్ర బృందం మరొక సాంగ్ విడుదల చేసింది.  'భలే భలే బంజారే'  అంటూ సాగే ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి స్టెప్పులు వేశారు.  ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.  ఈ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి వేసిన స్టెప్పులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.  అలాగే ఈ సాంగ్ కూడా సూపర్ గా ఉండడంతో యూట్యూబ్ లో ఈ సాంగ్ మిలియన్ ల కొద్దీ  వ్యూస్ ను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది.  విడుదలైన ఒక్కరోజులోనే యూట్యూబ్ లో 'భలే భలే బంజారా'  సాంగ్ 24 లక్షల వ్యూస్ ను ,  4.2 లక్షల లైక్ లను సాధించింది.  ఇలా 'భలే భలే బంజారే'  సాంగ్ యూట్యూబ్ లో ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: