అంటే సుందరానికి.. చిత్రం నుండి టీజర్ రిలీజ్..!!

Divya
శ్యామ్ సింగరాయ్.. వంటి సినిమాతో మంచి సక్సెస్ మీద ఉన్నాడు హీరో నాని.. ప్రస్తుతం అంటే సుందరానికి అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి దర్శకుడుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఇందులో మలయాళ నటి నజ్రియా నటిస్తోంది. ఇప్పటికీ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్నది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన ఫోటోలు, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక గత కొద్ది రోజుల కిందట నాని పంచకట్టు నుంచి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

ఈ చిత్రంలో నాని సరి కొత్త లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ రోజున హైదరాబాద్ లో టీజర్ ను విడుదల చేయడం జరిగింది.. ఇక టీజర్ విషయానికి వస్తే.. సుందర ప్రసాద్ అనే ఒక బ్రాహ్మణ యువకుడి పాత్రలో నాని అలరించనున్నాడు. ఇక కుటుంబంలో కేవలం ఒకే ఒక కొడుకు కావడంతో కుటుంబ సభ్యులు తనను ఎంతగా ప్రేమతో చూసుకుంటూ ఉంటారు. అలాంటి విపరీతమైన ప్రేమ వల్ల నాని చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా ఈ టీజర్ లో కనిపిస్తోంది.

ముఖ్యంగా నాని లైఫ్ లో ఏం జరిగినా కూడా అది జాతకంతో లింకు పెడుతూ ఉంటారు కుటుంబ సభ్యులు. అలా బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన సుందర్.. లీలా అనే ఒక క్రిస్టియన్ అమ్మాయి తో ప్రేమలో పడతాడు. ఇక ఈ రెండు కుటుంబాల మధ్య కులం, మతం గురించి పట్టింపు ఉన్నట్లుగా ఈ టీజర్ లో కనిపిస్తోంది. ఇక వీరిద్దరి ప్రేమకు కుటుంబ సభ్యు లు అంగీకరిస్తారా లేదా అనే విషయం తెలియాలంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. ఆ ఇందులో వివేక్ ఆత్రేయ నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: