నాలుగు సంవత్సరాలుగా చరణ్ వేరుగా ఉంటున్నారా..?

Divya
చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య చిత్రం ఎన్నో సార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది. డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం ఒక ధర్మస్థలి నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా చిత్రం అన్నట్లుగా కనిపిస్తోంది. తండ్రి కొడుకులు ఈచిత్రంలో కనిపించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇక అంతే కాకుండా 2 సంవత్సరాల తర్వాత వస్తున్న చిరంజీవి చిత్రం ఇదేనని చెప్పవచ్చు. ఇక ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా విడుదల చేశారు ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇక ఇందులో రామ్ చరణ్, చిరంజీవి పాత్రలో ఎంతో చూడముచ్చటగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రం విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. రామ్ చరణ్ కొరటాల శివ కలసి కొన్ని ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరుగుతోంది. రామ్ చరణ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. అవి ఏమిటంటే.. గత నాలుగేళ్లుగా చరణ్, చిరంజీవితో కలిసి ఉండటం లేదట. ఈ విషయం తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ కు గురయ్యారు.

గత నాలుగేళ్లుగా ఇప్పుడున్న ఇల్లు వర్కింగ్ లో ఉందని వేరువేరుగా ఉంటున్నామని.. కేవలం ఆది వారాలు మాత్రమే కల్పిస్తున్నామని తెలియజేశారు. కానీ ఆచార్య సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాలు అడవిలో షూటింగ్ చేయడం జరిగింది అక్కడ దాదాపుగా 20 రోజులు షెడ్యూల్ జరుపుకున్నామని తెలియజేశారు. ఆ షూటింగ్ వల్లే తన తండ్రితో కలసి బాగా టైం స్పెండ్ చేశానని తెలియజేశాడు రామ్ చరణ్. ఇక ఇలాంటి సమయంలోనే తన తండ్రితో కలసి ఉదయాన్నే లేసి భోజనం చేసి ఒకే కారులో షూటింగ్కు వెళ్లి అయిపోయాక ఇద్దరు కలిసి ఒకే కారులో తిరగడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అంతే కాకుండా తన తండ్రితో కలిసి ఉదయం వర్క్ అవుట్ కూడా చేయడంతో తన జీవితంలో ఇది మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు చరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: