జూనియర్ దీక్ష వెనుక ఆంతర్యం !
మెగా ఫ్యామిలీ టాప్ హీరోలు చిరంజీవి పవన్ రామ్ చరణ్ లు ప్రతి సంవత్సరం ఎదో ఒక దీక్ష చేస్తూ ఉంటారు. ఆ దీక్షా నీమాలు ఖచ్చితంగా పాటిస్తూనే తమ సినిమాల షూటింగ్ లలో కూడ పాల్గొంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ అయితే మరొక అడుగు ముందుకు వేసి చాల కఠినమైన చాతుర్మాస దీక్షను కొనసాగించడమే కాకుండా ఆ దీక్షా కాలంలో కఠిక నెల పై కేవలం చాప వేసుకుని పడుకుని ఉంటాడు అని అతడి సన్నిహితులు చెపుతూ ఉంటారు.
మెగా ఫ్యామిలీ హీరోల నమ్మకాలతో సరిసమానంగా బాలకృష్ణకు కూడ చాల నమ్మకాలు ఎక్కువ. చేతి ఐదు వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుంటూ మేడలో రుద్రాక్ష మాలతో చాల డిఫరెంట్ గా కనిపిస్తాడు బాలయ్య. అయితే ఈవిషయాలలో జూనియర్ ఎన్టీఆర్ తీరు వేరు. అతడు ఎప్పుడు పెద్దగా ఆలయాల చుట్టూ తిరగడు. కనీసం తిరుపతి కూడ అతడు వచ్చిన సందర్భాలు కనిపించవు. అయితే అతడి భార్య తల్లి మాత్రం ఆలయాలకు వెళ్ళడమే కాకుండా అక్కడ పూజలు కూడ చేయిస్తూ ఉంటారు.
అలాంటి జూనియర్ ఇప్పుడు తన పద్ధతి మార్చుకుని హనుమాన్ దీక్ష చేపట్టడమే కాకుండా ఆ దీక్షా వస్త్రాలతో కనిపిస్తూ ఆ దీక్షను చాల నియమ నిష్టలతో చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో నటించే సమయంలో చరణ్ తో పెరిగిన సాన్నిహిత్యంతో అతడి ప్రభావంతో ఇలాంటి దీక్షలు వైపు అడుగులు వేసాడా లేకుంటే జూనియర్ కు తనకు తానుగానే ఈ ఆధ్యాత్మిక ఆలోచనలు పెరిగాయ అన్నకోణంలో చర్చలు జరుగుతున్నాయి.
అయితే ఈ దీక్ష వెనుక మరొక ఆంతర్యం కూడ ఉంది అంటున్నారు. త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో నటించబోయే మూవీలో జూనియర్ యూనివర్సిటీ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడు. ఈపాత్ర కోసం తారక్ ను కొరటాల 20 కేజీల బరువు తగ్గాలని చెప్పాడట. ఇలా బరువు తగ్గాలి అంటే ఖచ్చితమైన ఆహార నియమాలు పాటించాలి కాబట్టి దీక్ష తీసుకుంటే పుణ్యంతో పాటు శరీర బరువు కూడ తగ్గుతుందని తారక్ ఆలోచన అనే వాదన కూడ వినిపిస్తోంది..