డైరెక్టర్ మారుతి ఇంట పెను విషాదం..!!
ఈ రోజున ప్రముఖ డైరెక్టర్ మారుతి తండ్రి కన్నుమూశారు.. మారుతి తండ్రి పేరు కుంచెల రావు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. ఈయన స్వగృహం మచిలీపట్నం. ఇక అక్కడే తుది శ్వాస కూడా విడిపోవడం జరిగింది. ఈయన అనారోగ్య కారణంగా మారుతి తండ్రి కన్నుమూసినట్లు గా తెలుస్తున్నది.. టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరుపొందాడు మారుతి యువ హీరోలతో సినిమాలు చేస్తు తన కెరియర్ను ముందుకు సాగిస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో వరుసగా స్టార్ హీరోలతో సైతం సినిమాలకు ఒప్పుకుంటు గా బిజీగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలోనే తన తండ్రి మరణ వార్తతో చాలా దిగ్భ్రాంతికి గురయ్యాడు డైరెక్టర్ మారుతి. ఇక ఈ మరణవార్తతో సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు సైతం మారుతి తండ్రి మరణానికి సంతాపం తెలియజేశారు.
ఇక వాటితో పాటు డైరెక్టర్ మారితి ని కూడా పలువురు సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక డైరెక్టర్ మారుతి తండ్రి బండ్ల మీద అరటిపండ్లు అమ్ముకునే వారట తను తన కుటుంబ పోషణ కోసం ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది.. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి హీరో గోపీచంద్, అందాల భామ రాశీ ఖన్నా తో కలసి పక్కా కమర్షియల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే రెబల్ స్టార్ ప్రభాస్ తో మరొక సినిమాను కూడా నిర్మిస్తున్నట్లు గా తెలుస్తోంది. మరి ఈ చిత్రాలు అన్ని ఘన విజయం కావాలని మనం కూడా కోరుకుందాం.