సర్ప్రైజ్ ఇవ్వబోతున్న త్రిబుల్ ఆర్ చిత్ర బృందం.. సాయంత్రం 4 గం.లకు?

praveen
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన కళాఖండం త్రిబుల్ ఆర్. బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత జక్కన్న తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా ఇటీవలే బాక్సాఫీస్ వద్ద ఎంతలా రికార్డులను కొల్లగొట్టిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమాలో అటు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు రామ్ చరణ్. ఇక  కొమరం భీం పాత్రలో నటించాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక వీరిద్దరి పాత్రలు ప్రేక్షకుల ఊహకందని విధంగా రాజమౌళి మలిచిన తీరు అద్భుతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 త్రిబుల్ ఆర్ సినిమాలో ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది అని చెప్పాలి. ఇక ప్రేక్షకులందరినీ మెప్పించిన ఈ సినిమా షాకింగ్ రికార్డులను  సృష్టించింది. దాదాపు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి తిరుగులేదు అని నిరూపించింది. మరోసారి రాజమౌళి తాను సినిమా తీస్తే తిరుగులేదు అని నిరూపించారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఈ సినిమాలోని వీడియో సాంగ్స్ ని సోషల్ మీడియాలో విడుదల చేస్తూ అభిమానులకు సర్ప్రైస్ ఇస్తుంది చిత్ర బృందం. ఇటీవలే నాటు నాటు అనే పాటను విడుదల చేసి  ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది అన్న విషయం తెలిసిందే.


 ఇక నేడు త్రిబుల్ ఆర్ చిత్ర బృందం మరోసారి ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్దమయింది. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ల మధ్య సాగే దోస్తి వీడియో సాంగ్ నేడు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నట్లు త్రిబుల్ ఆర్ మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎత్తర జెండా, కొమ్మ ఉయ్యాల నాటు నాటు వీడియో సాంగ్స్ విడుదల చేయగా ఇక సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. నేడు దోస్త్ సాంగ్ విడుదల చేస్తూ ఉండగా ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించిన కొమరం భీముడు వీడియో సాంగ్ చివర్లో రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించడం గమనార్హం. ఇక ఎంతో మంది ప్రేక్షకులు ఈ పాట కోసం ఎదురు చూస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Rrr

సంబంధిత వార్తలు: