రవితేజా పై ఎందుకు అంతనమ్మకం !

Seetha Sailaja
మాస్ మహారాజా రవితేజా ఒకప్పుడు మాస్ హీరోలలో మినిమం గ్యారెంటీ హీరో. అతడి డైలాగ్స్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ చాల విభిన్నంగా ఉండటంతో క్లాస్ ప్రేక్షకులతో పాటు మాస్ ప్రేక్షకులు కూడ మాస్ మహారాజా సినిమాలకు క్యూ కట్టేవారు. అయితే రవితేజా వయసు పెరగడంతో అతడి మొఖంలో గ్లో తగ్గి అతడి సినిమాలు కూడ రొటీన్ సినిమాలుగా మారిపోవడంతో వరస ఫ్లాప్ లు అతడికి ఎదురై అతడి మార్కెట్ పూర్తిగా పడిపోయింది.

ఈ వరస ఫ్లాప్ లకు ‘క్రాక్’ సినిమాతో బ్రేక్ పడినప్పటికీ ఆతరువాత వచ్చిన సినిమాలు మళ్ళీ అతడిని పరాజయం బాట వైపు నడిపించాయి. ఇలాంటి పరిస్థితులలో రవితేజా ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. లేటెస్ట్ గా ఈసినిమా కోసం 7 కోట్ల రూపాయలతో ఒక భారీ సెట్ వేసారు అని వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి.

ప్రస్తుతం రవితేజా మార్కెట్ పడిపోయినప్పటికీ అతడి పారితోషికం మాత్రం తగ్గించుకోకుండా 18 కోట్ల స్థాయిలో తీసుకుంటున్నాడు. దీనితో రవితేజా తో సినిమా తీసేవారికి సుమారు 50 కోట్ల వరకు పెట్టుబడి అవుతోంది. మాస్ మహారాజా సినిమాలు హిట్ అయితే ఆపెట్టుబడి వస్తుంది కానీ ఫ్లాప్ అయితే మాత్రం బయ్యర్లకు భారీ నష్టాలు వస్తున్నాయి. దీనితో రవితేజా తో సినిమా తీసేవారు పెట్టుబడి పెట్టడానికి జంకుతున్నారు.

ఇలాంటి పరిస్థితులలో ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీ కోసం 7 కోట్లు పెట్టి ఒక సెట్ వేయడం ఏమిటి అంటూ చర్చలు జరుగుతున్నాయి. 1970 ప్రాంతాలలో ఒక ఘరానా గజదొంగ గా పేరు గాంచిన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవితాన్ని స్టూవర్ట్ పురం నేపధ్యంలో బయోపిక్ గా తీస్తున్నారు. ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తోంది కాబట్టి తనకు ఈ మూవీ బ్రేక్ ఇస్తుందని రవితేజా ఆశ. ఈ మూవీలో రేణు దేశాయ్ కూడ కీలక పాత్రలో నటిస్తూ ఉండటం మరొక విశేషం...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: