పవన్ సినిమాకు పనిచేసే అవకాశం రెండు సార్లు వచ్చింది... కానీ కుదరలేదు...శేఖర్ మాస్టర్..!

Pulgam Srinivas
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ బిజీ కొరియోగ్రాఫర్ లలో శేఖర్ మాస్టర్ ఒకరు. శేఖర్ మాస్టర్ సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేయడం మాత్రమే కాకుండా డీ వంటి కొన్ని డాన్స్ ప్రోగ్రాం లకు జడ్జిగా కూడా వ్యవహరించి  బుల్లితెర అభిమానుల మనసు కూడా దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా శేఖర్ మాస్టర్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాలోని భలే భలే బంజారా అనే సాంగ్ కి కొరియోగ్రఫీ చేశాడు. తాజాగా విడుదలైన ఈ లిరికల్ సాంగ్ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. ఈ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి , మెగాస్టార్ పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి స్టెప్పులు వేశారు.

 ఆచార్య' మూవీ లో మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ చరణ్ కాంబినేషన్ సాంగ్ ను కంపోజ్ చేసే అవకాశం రావడం పట్ల శేఖర్ మాస్టర్ ఫుల్ ఖుషీ అవుతున్నాడు. మెగా ఫ్యామిలీ లో ముందుగా నాకు కాల్ చేసి అవకాశం ఇచ్చింది బన్నీ గారు అని  తాజాగా శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.  ఆ తరువాత నుంచి మిగతా వారి సినిమాలకు పని చేస్తూ వచ్చాను. మెగా ఫ్యామిలీ లో ఒక్క పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారి తోనే నేను వర్క్ చేయలేదు అని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.  పవన్ కళ్యాణ్   సినిమాలకి పని చేసే అవకాశం రెండు సార్లు వచ్చింది. నా దురదృష్టం కొద్దీ ఆ సమయంలో డేట్స్ క్లాష్ అయ్యాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలకు పని చేయడం కుదరలేదు. పవన్ కళ్యాణ్ నుంచి ఎప్పుడు పిలుపొస్తుందా అని వెయిట్ చేస్తున్నాను" అంటూ శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: