త్వరలో వివాహం చేసుకోబోతున్న మరొక ప్రేమ జంట..!!
ఇక అంతే కాకుండా సునీల్ శెట్టి బాలీవుడ్లో హీరో అయినప్పటికీ కూడా అతని పూర్వీకులు మాత్రం దక్షిణాది ప్రాంతానికి చెందిన వారే.. ముల్కీ లోని మంగళూరులో తులు అనే ప్రాంతానికి చెందిన వారు. మరొకవైపు కె.ఎల్.రాహుల్ కూడా మంగళూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. ఇక ఇలాంటి క్రమంలోనే ఆతియా, రాహుల్ వివాహాన్ని కూడా సౌత్ లో ఎంతో గ్రాండ్ గా, ఇండియన్ స్టైల్ లోనే వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఐపీఎల్ లో రాహుల్ లక్నో టీమ్ కు సారథిగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ ఆటగాడే కాకుండా కెప్టెన్గా ఆ జట్టును విజయాల బాట పట్టిస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఆతియా కూడ ఐపీఎల్ స్టేడియంలో అప్పుడప్పుడు కనిపిస్తూ సందడి చేస్తూ ఉండేది. ఇక రాహుల్ ఆడే ప్రతి మ్యాచ్కు కూడా ఈమె హాజరవుతున్నట్లు గా తన సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక వీరిద్దరూ కూడా పలు బ్రాండ్ సంస్థలకు అంబాసిడర్గా ఉన్నట్లుగా తెలుస్తోంది.