ప్రభాస్ - యష్ హీరోలుగా మల్టీస్టారర్?

praveen
బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ కేవలం భారీ బడ్జెట్ సినిమాలను మాత్రమే చేస్తూ ఉన్నాడు. ఇక ప్రస్తుతం కేవలం సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా భారతీయ చలన చిత్ర పరిశ్రమలోని అన్ని ఇండస్ట్రీలో కూడా మోస్ట్వాంటెడ్ హీరోగా మారిపోయాడు ప్రభాస్. ఇక అటు బాలీవుడ్ దర్శకులు సైతం ప్రభాస్ కోసం ప్రత్యేకంగా కథలు రాసుకుంటూ డార్లింగ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నా పరిస్థితి  ఉంది. అదే సమయంలో ఇక వరస సినిమా లతో దూసుకు పోతున్నాడు ప్రభాస్.


 అదే సమయంలో కే జి ఎఫ్ సినిమా తో సూపర్ సక్సెస్ అందుకున్న కన్నడ హీరో యష్ ఇక ఇప్పుడు కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అయితే యష్ తో కే జి ఎఫ్ సినిమా తీసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ అనే సినిమా తీస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  కే జి ఎఫ్ 2 సినిమానే  ఇలా ఉంటే ఇక ప్రభాస్ తో సలార్ సినిమా ఏ రేంజిలో ఉండబోతుందో అని అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇలాంటి సమయంలో ఇక ఇప్పుడు అభిమానుల నుంచి ఒక డిమాండ్ తెర మీదికి వచ్చింది.


 కన్నడ హీరో యష్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఒక మల్టీస్టారర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తే చూడాలని ఉంది అంటూ ఇక సోషల్ మీడియాలో అభిమానులు వరుస పోస్టులతో రచ్చ చేస్తూ ఉన్నారు. ఇక ఈ కథ  కేజిఎఫ్ సలార్ ల మిక్సింగ్ లాగా ఉండాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సలార్ మూవీకి కొనసాగింపుగా ఈ కథ ఉంటే బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారట. ఇలాంటి కథతో ఈ ఇద్దరు స్టార్ హీరోల కాంబినేషన్లో సినిమా వస్తే ఇక సినిమాకు తిరుగు ఉండదు అని అనుకుంటున్నారు అభిమానులు. మరి అభిమానుల కోరిక నెరవేరుతుందా అన్నది ఇప్పట్లో తేలే విషయం కాదు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: