తాజాగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్.అయితే ఈ సినిమా లో రామరాజు గా నటించిన రామ్ చరణ్ కి బాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇకపోతే రామరాజు గా ఆయన చూపించిన అద్భుతమైన నటనకి ఫిదా అయ్యారు.కాగా బాలీవుడ్ దర్శక నిర్మాతలు రాంచరణ్ తో సినిమాలు చెయ్యడానికి క్యూ కట్టేస్తున్నారు.ఇదిలావుంటే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటి అంటే..ఆయన ఇటీవలే ఒక్క ప్రముఖ బాలీవుడ్ మూవీ డైరెక్టర్ తో సినిమా చెయ్యడానికి మంతనాలు జరిపాడు అని...అంతేకాదు త్వరలోనే ఈ కాంబినేషన్ గురించి ఒక్క సెన్సషనల్ ప్రకటన అధికారికంగా జరగబోతుంది అని వార్తలు వస్తున్నాయి.
అయితే ఇంతకీ ఆ దర్శకుడు మరెవరో కాదు.అయితే మన సౌత్ లో రాజమౌళి ఎలా అపజయం ఎరుగని డైరెక్టర్ గా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడో....కాగా బాలీవుడ్ లో కూడా ఒక్క ఫ్లాప్ లేకుండా రాజ్ కుమార్ హిరానీ అనే దర్శకుడు ఉన్నాడు.ఇకపోతే ఈయన తెరకెక్కించిన 3 ఇడియట్స్ , pk , సంజూ, మున్నా భాయ్ MBBS మరియు లగేరహో మున్నాభాయ్ వంటి సినిమాలు బాలీవుడ్ లో ఎంత పెద్ద విజయాలు సాధించాయి.అయితే ఇప్పుడు ఈయనతోనే రామ్ చరణ్ త్వరలో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు అని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.ఇదిలావుండగా ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి అయినా తర్వాత పలుమార్లు ముంబై కి వెళ్లి రాజ్ కుమార్ హిరానీ తో కథాచర్చలు జరిపాడు అని..అంతేకాదు ఇప్పటికే ఒక్క కథ లాక్ అయ్యింది అని..ఇక త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి అని బాలీవుడ్ లో సాగుతున్న చర్చ..
ఇదిలావుంటే ఇప్పుడు ప్రస్తుతం రామ్ చరణ్ సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ గారితో ఒక్క సినిమా చేస్తున్నాడు.ఇకపోతే ఇటీవలే అమ్రిత్సర్ లో ఒక్క షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి తీసుకోచేందుకు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడు.అయితే ఇది దిల్ రాజు గురువుకి నిర్మాతగా 50 వ సినిమా కావడం తో, ఖర్చుకి ఏ మాత్రం వెనకాడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడట.ఇకపోతే ఈ సినిమా తర్వాత జెర్సీ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు.అయితే ఈ రెండు సినిమాలు పూర్తి అయినా తర్వాత రామ్ చరణ్ మరియు రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం ఉంది అని సమాచారం. అయితే త్వరలో రాజ్ కుమార్ హిరానీ షారుఖ్ ఖాన్ తో 'దుంకి' అనే సినిమా చెయ్యబోతున్నాడు.ఇకపోతే ఇది పూర్తి అయినా తర్వాత ఆయన రామ్ చరణ్ తో సినిమా చేస్తాడు అని వినిపిస్తున్న వార్త...!!