దిల్ రాజు ఆ సినిమా చేసి తప్పు చేస్తున్నాడా..?
భారీ నేపథ్యం కలిగిన సినిమాగా ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా కంటే విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ ఫ్లాప్ అయ్యింది. దాంతో ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దిల్ రాజు కు. బీస్ట్ సినిమా తాలూకు ప్రభావం ఈ సినిమా పైన పడితే కోట్ల నష్టం వాటిల్లడం ఖాయం కాబట్టే ఈ సినిమా పై లేని ఒత్తిడి ఇప్పుడు పెరిగింది. దాంతో ఈ సినిమా ను గట్టెక్కించాలని ఆలోచన దర్శక నిర్మాతలు కొత్తగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దర్శకుడిగా వంశీ పైడిపల్లి కి మంచి పేరుంది.
దిల్ రాజు కు కూడా నిర్మాతగా మంచి అనుభవం ఉంది. తన ఆలోచనలతో తెలివితేటలతో ఈ సినిమాను హిట్ చేసే విధంగా చేస్తాడు. ఈ నేపథ్యంలో ఏ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ చేస్తాడో చూడాలి. డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన దిల్ రాజు మొదట చిన్న సినిమాలను నిర్మించి ఆ తరువాత పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించిన వాడు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ తరహా సినిమాలు చేయాలని చెప్పి ఇతర భాషల హీరోలతో సినిమాలు చేస్తున్నాడు అదే సమయంలో తెలుగు హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నాడు. మరి తొలి సారి విజయ్ తో చేస్తున్న సినిమా ఏ స్థాయి లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.