ఒకప్పటి స్టార్ హీరో.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..?
సినీ ఇండస్ట్రీ ఎంతో మంది నటీనటులకు లైఫ్ ఇచ్చింది. ఈ ఇండస్ట్రీ బాగా బతికిన వాళ్లున్నారు.. బాగా బతికి చెడిన వాళ్లూ ఉన్నారు. మీకు ఒక సామెత గుర్తుకు ఉండే ఉంటుంది. ‘బండ్లు ఓడలు అవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి..’ ఈ సామెతను పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే ఇండస్ట్రీలోని నటీనటులకు ఇది బాగా సూట్ అవుతుంది. సినీ ఇండస్ట్రీలో కొందరు ఎంత వేగంగా ఎదుగుతారో.. అంతే వేగంగా మరికొందరు దీనస్థితికి దిగజారుతారు. ఇండస్ట్రీలో ఒకసారి స్టార్డమ్ వచ్చిందంటే.. దానిని కాపాడుకోవడానికి చాలా కష్టపడాలి.. ఒక వేళ ఆ స్టార్డమ్ చేయి జారితే కోలుకోవడానికి ఎంతో సమయం పడుతుంది.
అలా ఫేమ్‌ను కోల్పోయి ఇప్పుడు కనీసం గుర్తుపట్టలేనంతగా మారిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా ఒకప్పటి స్టార్ హీరో వేణు తొట్టెంపూడి. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపాడు. ఇండస్ట్రీలో ఎంత త్వరగా పేరును సంపాదించుకున్నాడో.. అంతే తొందరగా పేరును కోల్పోయాడు. ఆ తర్వాత బిజినెస్‌లో ఎంటర్ అయి వ్యాపారం చేసుకుంటున్నాడు. ‘స్వయంవరం’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వేణు.. ఆ తర్వాత వెను తిరగలేదు. వరుస విజయాలతో దూసుకెళ్తూ.. కోట్లాది మంది ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్నారు.
జీవితం పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కొన్ని తప్పటడుగులు వేశాడు. సినిమా స్టోరీ ఎంపికలో తప్పులు చేస్తూ.. వరుస ఫ్లాపులతో పూర్తిగా దెబ్బతిన్నాడు. ఆ తర్వాత అనుపమ అనే అమ్మాయిని 2001లో పెళ్లి చేసుకుని బిజినెస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే హీరో వేణు ఇండస్ట్రీలోకి రాణించకపోవడానికి ప్రధాన కారణం కథల ఎంపికేనని పలువురు సినీ ప్రముఖులు అంటున్నారు. స్టోరీ ఎంపికలో ప్రత్యేక దృష్టి సారించి ఉంటే.. ఇప్పటికీ మంచి హీరోగా కొనసాగేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం వేణు తన సెకండ్ ఇన్నింగ్స్ లో మాస్ మహారాజా హీరో రవితేజతో కలిసి ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతోనైనా వేణుకి మంచి పేరు రావాలని పలువురు ఆశిస్తున్నారు.