అందాల ముద్దుగుమ్మ
కీర్తి సురేష్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కీర్తి
సురేష్ 'నేను శైలజ' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ను సంపాదించుకుంది. ఆ తర్వాత
కీర్తి సురేష్ 'మహానటి' సినిమా ద్వారా గొప్ప నటిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది. మహానటి
సినిమా తర్వాత ఎన్నో లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన కూడా కీర్తి
సురేష్ కు 'మహానటి' రేంజ్ విజయం మాత్రం ఇప్పటి వరకు దక్కలేదు.
సర్కారు వారి పాట
సినిమా మే 12 వ తేదిన విడుదల కాబోతుంది. ఈ
సినిమా కంటే ముందే
మహానటి కీర్తి సురేష్ మరో సినిమాతో ప్రేక్షకులను అలరించబోతోంది. కాకపోతే
కీర్తి సురేష్ నటించిన
సినిమా థియేటర్ లో కాకుండా 'ఓ టి టి' లో విడుదల కాబోతుంది. కీర్తి సురేష్ తాజాగా నటించిన
మూవీ 'సాని కాయిదమ్'. ఈ
సినిమా ని తెలుగులో 'చిన్ని' పేరుతో విడుదల చేయనున్నారు. ప్రముఖ 'ఓ టి టి' సంస్థ
అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ
సినిమా మే 6 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ
మూవీ లో
కీర్తి సురేష్ తో పాటు ధనుష్ అన్న,
డైరెక్టర్ సెల్వ రాఘవన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ
మూవీ కి సంబంధించిన టీజర్ ను కోలీవుడ్ హీరో ధనుష్ శుక్రవారం ఏప్రిల్ 22 వ తేదీన విడుదల చేశారు. మరి ఈ సినిమాతో
కీర్తి సురేష్ ఏ మేర ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.