ప్రస్తుతం ఎక్కడ చూసినా కే జి ఎఫ్ చాప్టర్ 2 మేనియా కనబడుతుంది. యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా ఈ నెల 14 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయ్యిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట నుండి పాజిటివ్ టాక్ ను సాదించుకొని ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్లను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాపై ఇప్పటి వరకు ఎంతో మంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.
తాజాగా అల్లు అర్జున్ కూడా కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ యూనిట్ కు అల్లు అర్జున్ అభినందనలు తెలియజేశాడు. కే జి ఎఫ్ చాప్టర్ 2 లో హీరోగా నటించిన యష్ అద్భుతంగా నటించాడు. అలాగే సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి పాత్రలు చాలా అద్భుతంగా ఉన్నాయి అని అల్లు అర్జున్ పేర్కొన్నాడు. సంగీత దర్శకుడు రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ కి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ అల్లు అర్జున్ అభినందనలను తెలియజేశాడు.
ఇలా సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కే జి ఎఫ్ చాప్టర్ 2 చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ పోస్ట్ కి రవీనా టాండన్ రిప్లై ఇచ్చింది. అల్లు అర్జున్ థాంక్యూ, నేను మీకు పెద్ద అభిమానిని. మీ పుష్ప మూవీ చాలా నచ్చింది. మీకు మరిన్ని బ్లాక్ బస్టర్ విజయాలు రావాలి అని, బన్నీ పోస్ట్ కు రవీనా టాండన్ రిప్లై ఇచ్చింది.