వరుసగా స్టార్ హీరోలని లైన్లో పెట్టిన కొరటాల!

Purushottham Vinay
ఫస్ట్ సినిమా "మిర్చి" తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కొరటాల శివ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టార్ హీరోలనే టార్గెట్ గా పెట్టుకుని ఏడాదికి ఇంకా రెండేళ్లకో సినిమా చేస్తూ వస్తున్నారు. మిర్చి సినిమా తరువాత రెండేళ్లు `శ్రీమంతుడు` సినిమా చేశారు. ఆ తరువాత ఏడాదికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో `జనతా గ్యారేజ్` సినిమా తెరకెక్కించారు.ఈ సినిమా తరువాత మరో ఏడాది తరువాతే ఆయన తెరకెక్కించిన `భరత్ అనే నేను` సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత కొరటాల నుంచి ఇప్పడు `ఆచార్య` సినిమా రాబోతోంది. ఇలా ఏడాది రెండేళ్లు ఇంకా అలాగే నాలుగేళ్లు సినిమా సినిమాకు గ్యాప తీసుకుంటున్న కొరటాల శివ ఇప్పడు తన రూటు మార్చేశారు.ఈ సినిమా తరువాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని ఆయన ఫిక్సయ్యారు. `ఆచార్య` సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఅర్ 30వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.




ఈ సినిమా జూన్ నుంచి సెట్స్ పైకి రాబోతోంది. దీని తరువాత మరో మూడు సినిమాలు చేయబోతున్నానని ఇటీవల `ఆచార్య` సినిమా ప్రమోషన్ లలో భాగంగా వెల్లడించారు. తన ఫేవరేట్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు తో కూడా మరోసారి ఓ సినిమా చేయబోతున్నారట. దీనికి సంబంధించిన బేసిక్ లైన్ కూడా ఓకే అయిందని చెప్పారు. అంతే కాకుండా రామ్ చరణ్ తోనూ ఓ సినిమా చేయబోతున్నారట.ప్రస్తుతం చర్చలు కూడా జరుగుతున్నాయని దీనికి సంబంధించిన ప్రకటన సరైన సమయంలో వుంటుందన్నారు. అంతే కాకుండా అల్లు అర్జున్ తో కూడా గతంలో ఓ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. అది డేట్స్ ని బట్టి ఎప్పుడు వుంటుందో కూడా చెబుతానన్నారు. ఇలా నాలుగేళ్ల విరామం తరువాత దర్శకుడు కొరటాల శివ తన రూటు మార్చేసి బ్యాక్ టు బ్యాక్ మూడు ప్రాజెక్ట్ లు చేయబోతుండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: