రజనీకాంత్ చిత్రంలో మరొక స్టార్ హీరో.. ఎవరంటే..!!

Divya
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమాని తెరకెక్కించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.. యువ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో రజనీకాంత్ ఎప్పుడూ ముందువరుసలో ఉంటారని చెప్పవచ్చు. ఈ డైరెక్టర్ తెరకెక్కించింది ఇప్పటి వరకు మూడు సినిమాలే అయినా తొలి రెండు సినిమాలు మంచి సక్సెస్ను అందుకున్నాయి. ఇక రజనీకాంత్ 169 వ సినిమాకు ఈ డైరెక్టర్ ని లాక్ చేయడం జరిగింది.

తాజాగా ఈ సినిమాలో మరో యువ హీరో శివ కార్తికేయన్ కూడా నటించబోతున్నాడు అనే వార్త వినిపిస్తోంది. ఇక డైరెక్టర్ నెల్సన్, శివ కార్తికేయన్ కాంబినేషన్లో వచ్చిన డాక్టర్ చిత్రం ఎంత విజయం అందుకుందో మనకు తెలిసిన విషయమే. ఇక రజనీకాంత్ తన తదుపరి చిత్రంలో కూడా శివ కార్తికేయన్ ఒక మెయిన్ రోల్ పోషిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మరి శివ కార్తికేయన్ ఎవరికోసం ఈ సినిమాలో నటిస్తున్నారు తెలియాల్సి ఉంది. అయితే మరొక వార్త వినిపిస్తుంది అది ఏమిటంటే.. విజయ్ దిలీప్ కలిసి తెరకెక్కించిన బీస్ట్ చిత్రం విడుదలవ్వగా ఈ సినిమా  యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా భారీ అంచనాల మధ్య విడుదల కాగా ఈ సినిమా విఫలమైంది.

దీంతో తీవ్ర నిరాశతో చెందిన అభిమానులు రజినీకాంత్ తో తీయబోయే సినిమా పైన ఈ ఎఫెక్ట్ పడుతుందని విజయ్ అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇవన్ని ఒట్టి పుకార్లే అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక సినిమా ఫ్లాప్ తో ఏ డైరెక్టర్ ని అంచనా వేయడం తప్పు కాదు.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ గతంలో ఎన్నో సినిమాలను సక్సెస్ లు చూసే రజినీకాంత్ ఆయనతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారని ఆయన అభిమానులు తెలియజేస్తున్నారు. ఖైదీ చిత్రానికి దర్శకత్వం వహించిన లోకేష్ కనకరాజు కు ఇలాంటి అవకాశం ఇచ్చాడు రజనీకాంత్. మరి శివ కార్తికేయన్ నటిస్తాడో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: