సౌత్ సినిమాలను చూసి బాలీవుడ్ నేర్చుకోవాలట!!

P.Nishanth Kumar
 ఇటీవల కాలంలో తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వచ్చే సినిమాలు దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను భారీగా అలరిస్తున్నాయి. సౌత్ సినిమా పరిశ్రమలో విడుదలయ్యే ప్రతి చిన్న సినిమా కూడా ఇప్పుడు ఉత్తరాదిన పలు భాషలలో విడుదల అవుతున్నాయి. దాంతో ఆయా సినిమాలను చూడడానికి సదరు ప్రాంతీయ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. బాగా ఉన్న సినిమాలను వారు ఆదరిస్తూ వాటికి మంచి విజయాలను చేకూరుస్తున్నారు. తద్వారా ఇప్పుడు బాలీవుడ్ సినిమాల కంటే దక్షిణాది సినిమాలకు ఎక్కువగా డిమాండ్ నెలకొంది.

బాహుబలి సినిమానే ఈ విధమైన ఆలోచనా ధోరణిని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఒక్క దర్శకుడు ప్రతి ఒక్క నిర్మాత ప్రతి ఒక్క హీరో కూడా ఈ తరహాలో సినిమాలను చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉన్నారు. తాజాగా విడుదలైన కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు సైతం అందరినీ అలరించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్ సినిమా పరిశ్రమ పరిస్థితి కొంత అయోమయంగా ఉంది.  అక్కడ సినిమాలు ప్రేక్షకులను గతంలో అలరిస్తున్నారు ఇప్పుడు అలరించలేకపోతున్నాయి. దానికి తోడు దక్షిణాదిన ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలు సూపర్ హిట్ అవడంతో బాలీవుడ్ పై మరింత ఒత్తిడి నెలకొంది. 

బాలీవుడ్ సినిమా పరిశ్రమలోని కొంతమంది సినిమా విశ్లేషకులు సైతం దక్షిణాదిన వస్తున్న సినిమాల నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ చురకలు అంటించడం వారిపై మరింత ఒత్తిడి పెరగడానికి ముఖ్యకారణం. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఇకనైనా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించి సినిమాలు చేస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం బాలీవుడ్ పెద్ద హీరోలు అందరూ కూడా మంచి క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ చిత్రాలు ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తాయి చూడాలి. ఈ సారి సౌత్ సినిమా లను దాటి హిట్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: