ఎన్టీఆర్ తో కొరటాల సినిమా కథ ఏంటంటే?

Satvika
ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫిస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కూడా సినిమాకు మంచి క్రేజ్ దక్కింది.జక్కన్న మ్యాజిక్ తో హిట్ అయ్యిందని సినీ వర్గాల్లో టాక్.ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోలకు ఈ సినిమా మంచి ఫెమ్ ను అందించింది. ఆ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ తో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఎవరూ రీచ్ కాలెని కలెక్షన్స్ ను అందుకుంది. ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోలు అయ్యారు.ఈ హీరో లతో సినిమాలు చేయడానికి దర్షక,నిర్మాతలు కాల్ షీట్లు కోసం వెయిట్ చేస్తున్నారు.


అయితే, రామ్ చరణ్ మాత్రం వరుస సినిమాలను చేస్తున్నారు.. ఆర్ఆర్ఆర్ చెస్తూనె ఖాళీ సమయం లో మిగిలిన సినిమాలను చేస్తున్నారు.. ఆయన నటించిన ఆచార్య సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా వుంది.ఇక ఎన్టీఆర్ ఇప్పుడు మరో సినిమాలో నటించెందుకు రెడీ అయ్యాడు.డైరెక్టర్ కొరటాల శివ తో తదుపరి సినిమాను చేయనున్నారు.భరత్‌ అనే నేను' నుంచి 'ఆచార్య' వరకూ నాలుగేళ్ల తర్వాత మరో సినిమా విడుదల అవుతుండటం విశేషం.ఆచార్య' ఆలస్యం అవ్వడానికి రకరకాల కారణాలు. ఏదైతేనేం..? నాలుగేళ్లకు ఓ సినిమా అనేది అమోదయోగ్యం కాదు. ఇప్పుడు కొరటాలకు స్పీడు పెంచాల్సిన అవసరం ఏర్పడింది.


ఎప్పుడూ మాస్ కథలతో సినిమాలను చేస్తున్న మన డైరెక్టర్ ఇప్పుడు మరో సినిమా కథను సిద్దం చేశారు. త్వరలో ఎన్టీఆర్‌తో ఓసినిమా చేయబోతున్న విషయాన్ని ఎప్పుడో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే..ఈ సినిమా కథ ఎప్పుడో సిద్ధమైంది. కాకపోతే ఎలాంటి కథ అనే విషయంలో స్పష్టత లేదు. ఎన్టీఆర్‌తో ఏ కథ చేయబోతున్నారు? అని అడిగితే కనీవినీ ఎరుగని కథలో, ఇది వరకెప్పుడూ చూడని నేపథ్యంలో ఈ సినిమా అని కొరటాల ఊరిస్తున్నారు. జూన్ నెల మొదటి వారం నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.ఇకపోతే రామ్ చరణ్, మహేష్ బాబు తో సినిమాలు చేయడానికి కథలు కూడా సిద్దం చేశారు.ఏది ముందు సెట్స్ మీదకు వెలుతుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: