ఆచార్య ప్రమోషన్స్.. ఎవరిని తాకట్లేదుగా!!

P.Nishanth Kumar
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదల అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది. దాంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలో పెరిగిపోయాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా ఈ చిత్రం లోని కీలకమైన పాత్రలో ఆయన నటిస్తుండడం విశేషం. ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తూ ఉంది.

ఈ సినిమా విడుదలకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. దాంతో ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు చిత్రబృందం వేగవంతం చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు పెద్దగా జరగకపోవటం మెగా అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ఇలా జరగడం పట్ల అందరూ ఎంతగానో నిరాశపడుతున్నారు. భారీ స్థాయిలో క్రేజ్ నెలకొని ఉన్న ఈ సినిమా ప్రచారం విషయంలో ఇలా వ్యవహరిస్తూ ఉండడం సినిమా ఫలితంపై ప్రభావం చూపిస్తుందని అభిమానులు చెబుతున్నారు.

మరి ఇప్పటికైనా ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు మరింత వేగవంతం చేసి చిత్రాన్ని అందరికీ చేరేలా చేయాలని భావిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఎప్పుడో పూర్తయిన కూడా చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నడంతో తొలిరోజే భారీ వసూళ్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి పూర్తిస్థాయిలో నటిస్తున్న ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. పాన్ ఇండియా సినిమాగా వస్తుందని చెప్పినా కూడా ఆ తరహాలో ఈ సినిమా విడుదల కాకపోవడం కొంత నిరాశ అయినప్పటికీ తెలుగునాట రికార్డులను ఈ చిత్రం ఈ స్థాయి లో సాధిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: