పవన్ చేసే సినిమాలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయో తెలుసా..?

P.Nishanth Kumar
పవన్ కళ్యాణ్ ఒక్కొక సినిమాను పూర్తి చేస్తూ దానిని విడుదల చేస్తూ విజయాన్ని అందుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఇప్పటి కే ఆయన వరుసగా రెండు భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.  ఇప్పుడు ఓ చారిత్రాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. క్రిష్ దర్శకత్వం లో ఆయన చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని భావించిన యూనిట్ షూటింగ్ చేయని కారణంగా సినిమాను పూర్తి చేయని కారణంగా ఇప్పుడు ఆలస్యంగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది.

మే నెలలో మిగిలిన షూటింగ్ చేయబోతున్నారు. అలా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయనున్నాడు పవన్ కళ్యాణ్. ఇక ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వం లో ఆయన భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం మాస్ మసాలా సినిమాగా తెరకెక్కుతోంది. ఇకపోతే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. తొందర్లోనే దీనికి సంబంధించిన పనులు మొదలు కాబోతున్నాయి. ఇవే కాకుండా మరొక రెండు సినిమాలను కూడా పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ సుజీత్ దర్శకత్వంలో తేరీ అనే తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమై ఉన్నాడు సుజిత్.  ఆ తర్వాత సముద్రఖని దర్శకత్వంలో ఓ తమిళ రీమేక్ సినిమాలో సైతం పవన్ నటించేందుకు సిద్ధం అవుతున్నాడని అంటున్నారు. అలా ఐదు సినిమాలతో ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఎన్నికల హడావుడి 2023 ఆఖరిలో మొదలవుతున్న నేపథ్యంలో ఈలోపు ఇప్పుడు ఒప్పుకున్న ఈ సినిమాలు కూడా పూర్తి చేయాలి అనేది పవన్ కళ్యాణ్ టార్గెట్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: