మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్..
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా ఆచార్య.. షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది.ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ సినిమా పై భారీ అంచనాలను పెంచుతున్నాయి..సినిమా ఎప్పుడూ విడుదల అవుతుందా అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ కావడానికి కేవలం మూడు రోజులు మాత్రమే ఉండటం తో సినిమా ప్రమోషన్స్ లో జోరును పెంచారు.సినిమాను జనాల్లొకి తీసుకెల్లాలని చిత్ర యూనిట్ వినూథ్న ఆలోచన చేస్తున్నారు.
ఈ మేరకు రామ్ చరణ్ పలు మీడియా చానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సినిమా యొక్క విషయాలను అభిమానులతో పంచుకుంటూన్నారు.ఈ సందర్భంగా రామ్‌చరణ్ ఒక విషయాన్ని అభిమానుల తో పంచుకున్నారు.అభిమానులు ఎప్పటి నుంచో నిరీక్షిస్తున్న కాంబినేషన్ త్వరలో పట్టాలెక్కనుంది. బాబాయి పవన్ కళ్యాణ్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాను. ఆ ప్రాజెక్టుకు నిర్మాత కూడా నేనే. పూర్తి వివరాలు త్వరలోనే రివీల్ చేస్తాం' అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వార్తతో మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతానికి చెర్రీ.. శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న సినిమా లో నటిస్తూన్నారు. ఆ సినిమా తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెల్లవచ్చునని సమాచారం.