"ఆచార్య" కు శుభవార్త.. టికెట్ ధరలు పెంపు?
ఇప్పుడు అదే విధంగా మరొక్క సినిమా ఈ వారం విడుదల కావడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉంది. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లలో ఒకరైన కొరటాల శివ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఆచార్య గా మెగాస్టార్ చిరంజీవి ఈ శుక్రవారం రానున్నాడు. ఇందులో మెగా పవర్ స్టార్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ సిద్దాగా ప్రేక్షకులను అలరించనున్నాడు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. అదేమిటో తెలుసా... సినిమా కలెక్షన్ లను దృష్టిలో ఉంచుకుని... టికెట్ ధరలను పెంచింది... అది కూడా కేవలం వారం రోజుల వరకు మాత్రమే పరిమితి ఇచ్చింది. ఏప్రిల్ 29 నుండి మే 5 వరకు పెరిగిన టికెట్ ధరలు అందుబాటులో ఉండనున్నాయి.
మల్టీ ప్లెక్స్ లలో టికెట్ మీద 50 రూపాయలు మరియు మిగిలిన థియేటర్ లలో ౩౦ రూపాయలు పెంచుకోవచ్చు అని తెలిపింది. ఇక రోజుకు అయిదు షో లు కూడా వేసుకోవచ్చు అని తెలంగాణ ప్రభుత్వం ఆచార్య టీమ్ కు లడ్డూ లాంటి వార్త చెప్పి సర్ప్రైజ్ చేసింది. ఈ వార్త విన్న చిత్ర బృందం మరియు మెగాస్టార్ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.