ఈవారం థియేటర్ మరియు 'ఓటిటి' లో సందడి చేయబోయే సినిమాలు ఇవే..?

Pulgam Srinivas
ప్రతివారం కొన్ని సినిమాలు థియేటర్ లలో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటే మరికొన్ని సినిమాలు 'ఓ టి టి' ప్ లో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాయి.  అలాగే ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్ పావు ప్రేక్షకులను అలరించడానికి రెడీ గా ఉంటే మరి కొన్ని సినిమాలు 'ఓ టి టి' లో ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉన్నాయి. ఈ వారం థియేటర్ లలో మరియు  'ఓ టి టి' లో ప్రేక్షకులను అలరించబోయే సినిమాల గురించి తెలుసుకుందాం.

 
ఆచార్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా , కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఈ నెల 29 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.


కణ్మని రాంబో ఖతిజా : విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో  నటించిన తమిళ  మూవీ 'కాతు వాక్కు రెండు కాదల్'. ని  'కణ్మని రాంబో ఖతిజా' పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 28 వ తేదిన విడుదల కాబోతుంది.

 
రన్ వే 34 : అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన రన్ వే 34 మూవీ ఈ నెల 29వ తేదీన విడుదల కాబోతుంది.


ఈవారం 'ఓ టి టి' లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్న సినిమాలు.


గంగూబాయ్ కథియావాడి : ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గంగూబాయ్ కథియావాడి మూవీ ఈ నెల 26 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి'  నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.


మిషన్ ఇంపాజిబుల్ : తాప్సి ప్రధానపాత్రలో తెరకెక్కిన మిషన్ ఇంపాజిబుల్ మూవీ ఏప్రిల్ 29వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: