ప్రస్తుతం సమంత వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతుంది. విడాకుల తర్వాత సినిమాల్లో నిలదొక్కుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అవ్వడం అందులోనూ ఆమెకు విశేష స్పందన రావడం వలన ఆమెకు గుర్తింపు బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే సమంత ఇమేజ్ భారీగానే పెరిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు కూడా పలు ఆసక్తికరమైన సినిమాల్లో ఆమె నటిస్తోంది.
తమిళనాట విజయ్ సేతుపతి హీరోగా చేసిన ఓ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.కతియా రాంబో రజినీ అనే పేరుతో రాబోతున్న ఈ సినిమా లో నయనతార తో కలిసి ఆమె నటించింది. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల అవుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో తెలుగులో విజయ్ సేతుపతి కి మరియు నయనతార కు తక్కువ ఇమేజ్ వున్న కారణంగా సమంతకు భారీ స్థాయి క్రేజ్ వున్న కారణంగా ఆమెనే ఈ సినిమా ఆడేలా చేయాలి అని చిత్రబృందం భావిస్తోంది. తెలుగునాట టాప్ హీరోయిన్ గా ఉన్న సమంతకు ఫ్యాన్స్ కోట్లాది మంది ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు
ఈ నేపథ్యంలో ఆమె అభిమానులు ఈ సినిమాను చూసి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. కాన్సెప్ట పరంగా ఈ చిత్రం ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరిస్తుంది అని చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విజయ్ సేతుపతి ఇక్కడ కొంత గుర్తింపు ఉందని చెప్పవచ్చు. ఈ గుర్తింపు ఈ సినిమా విజయం లో ఎలాంటి పాత్ర పోషిస్తుందో చూడాలి. ఇకపోతే సమంత విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ లో, హాలీవుడ్ లో కూడా ఆమె అవకాశాలు అందుకోవడం విశేషం.