ఎన్టీఆర్ తో రాజమౌళి చేయవలసిన గరుడ సినిమా ఏమైంది..!!

Divya
యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి నాలుగవ సారి కలిసి పనిచేసిన సినిమా rrrసినిమా లో రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ తో కలిసి నటించడం జరిగింది. ఈ సినిమా ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కొన్ని సంచలన విజయాలను అందుకుంది. దాదాపుగా ఇప్పటివరకు 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టినట్లు గా సమాచారం అందుతోంది. ఇదంతా యిలా వుండగా ఈ సినిమా విడుదలయ్యే అప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళి పైన చాలా కోపంగా ఉన్నారు. ఎన్టీఆర్ ని ఈ సినిమాలో కావాలని చాలా తగ్గించి చూపించారని.. రామ్ చరణ్ కి బారి స్కోప్ ఉండేలా చేశారని వారు అభిప్రాయపడుతున్నారు.


అయితే తాజాగా రాజమౌళి కి సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ఎన్టీఆర్ అభిమానులు సైతం రాజమౌళిపై ఈ వీడియోతో ట్రోలింగ్ మొదలుపెట్టారు. అయితే ఈ వీడియో కాస్త బయటికి రావడం జరిగింది. బాహుబలి 2 సినిమా సమయంలో రాజమౌళి ఒక ఇంటర్వ్యూకు సంబంధించిన ఒక వీడియో బయటికి రావడం జరిగింది. ఆ వీడియోని రాజమౌళిని పాయింట్ ఆఫ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. బాహుబలి తర్వాత తన తదుపరి చిత్రం ఏమిటి అని అడుగగా ఒక భారీ ప్రాజెక్టు గురించి తెలియ జేశాడు.


అదే గరుడ. ఈ సినిమాని బాహుబలి2 తర్వాత తను చేయాలనుకుంటున్నానని తెలియజేశాడు. దీనికి సంబంధించి ఒక ఐడియా తన మైండ్ తో రన్ అవుతోంది అని కూడా తెలియజేశాడు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు గురించి ఇంతకు మించి ఏమీ చెప్పలేనని తెలియజేశాడు. అంతేకాక ఈ సినిమాని ఎన్టీఆర్ తో చేయబోతున్నాడని స్పష్టం కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా పై ఎలాంటి కార్యక్రమం దాల్చలేదని.. ఈ సినిమాపై రాజమౌళి అసలు మాట్లాడలేదని అభిమానులు లు ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: