'ఆచార్య' సినిమాలో చరణ్ పాత్ర నిడివిని పెంచారా..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఈ నెల 29 వ తేదీన విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.  ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో చిత్ర బృందం ఈ సినిమా లోని పాటలను ఒక దాని తర్వాత ఒకటి విడుదల చేస్తూ వస్తోంది.  ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.  ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటి వరకు ఆచార్య సినిమా నుండి చిత్ర బృందం నాలుగు పాటలను విడుదల చేయగా,  ఈ నాలుగు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.  


ఇది ఇలా ఉంటే ఆచార్య సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలకపాత్రలో నటించబోతున్నాడు.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆచార్య' సినిమాలో  సిద్ద అనే పాత్రలో కనిపించబోతున్నాడు.  ఇప్పటికే ఆచార్య సినిమా నుండి రామ్ చరణ్ కు సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం విడుదల చేయగా ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.  ఇది ఇలా ఉంటే ముందుగా ఆచార్య సినిమాలో రామ్ చరణ్ పోషించిన సిద్ధ అనే పాత్రను 15 నిమిషాల నిడివి వరకు ఉంచాలి అని చిత్ర బృందం అనుకున్నారట.  


కాకపోతే ఆ తర్వాత రామ్ చరణ్ పోషించిన సిద్ధ పాత్ర బాగా రావడంతో ఈ పాత్ర నిడివి పెంచుతూ వచ్చారట.  దానితో కాస్త 15 నిమిషాలు అనుకున్నా సిద్ధ పాత్ర 45 నిమిషాల వరకు ఈ సినిమాలో ఉండనునట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ పాత్ర 'ఆచార్య'  సినిమాలో ఫస్ట్ హాఫ్ లను  సెకండ్ హాఫ్ లను  ఉండనున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: