ఆ స్టార్ హీరోపై కోపంతోనే తేజ జయం సినిమా తీశాడా..?

Divya
డైరెక్టర్ తేజ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తన మొదటి రెండు చిత్రాలు అయినటువంటి చిత్రం , నువ్వు - నేను వంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకొని జయం లాంటి సినిమాలతో బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు . అంతేకాదు డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ఎంతో మంది కుర్ర హీరోలు కూడా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక వార్త బాగా వైరల్ గా మారింది. అదేమిటంటే ఒక స్టార్ హీరో పై కోపంతోనే తేజ జయం సినిమాలు తీశాడు అనే వార్త బాగా వైరల్ గా మారడం గమనార్హం. అయితే ఇంతకు ఎవరు ఆ స్టార్ హీరో ఎవరు..? తేజ కి ఎందుకు కోపం వచ్చింది..?  అని పూర్తి వివరాలను కూడా ఇప్పుడు ఒక సారి తెలుసుకుందాం..
తేజ మొదటి రెండు సినిమాలు.. చిత్రం, నువ్వు - నేను రెండు సినిమాలను కూడా ఉదయ్ కిరణ్ తో  తెరకెక్కించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు తేజ.  అయితే నువ్వు నేను సినిమా షూటింగ్ సమయంలో ఉదయ్ కిరణ్ కి , తేజ కి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడం జరిగింది. మనస్పర్ధలు ఎంతలా మారాయి అంటే ఒకరికి - మరోకరు పోటీగా సినిమాలను తెరకెక్కించడం జరిగింది. ఉదయ్ కిరణ్ కూడా వి.యన్. ఆదిత్య దర్శకత్వంలో మనసంతా నువ్వే సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక అదే డైరెక్టర్ తో మరొకసారి శ్రీరామ్ సినిమాని కూడా చేశారు. ఇక ఈ సినిమాలో కూడా నువ్వు నేను హీరోయిన్ అనిత హీరోయిన్ గా నటించడం గమనార్హం.
ఇక ఉదయ్ కిరణ్ పైన కోపం తో తేజ  జయం  సినిమాను తీయాలని అనుకున్నాడు. అనుకున్నట్టుగానే శ్రీరామ్ సినిమాకు పోటీగా జయం సినిమాను వారం రోజుల తేడాతో విడుదల చేసి తేజ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కానీ  శ్రీరామ్ సినిమా మాత్రం యావరేజ్ గా మిగిలింది. నిజానికి తేజ జయం సినిమాను ఉదయ్ కిరణ్ పై కోపంతో అల్లు అర్జున్ ను  హీరోగా తెలుగు తెరకు పరిచయం చేయాలని అనుకున్నాడు . కానీ అప్పటికే రాఘవేంద్రరావు అల్లు అర్జున్ ను తన సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం చేస్తామని ప్రకటించడంతో నిర్మాతలు అల్లు అరవింద్ అలాగే అశ్వినీదత్ లు కూడా  రాఘవేంద్రరావు వైపు మొగ్గు చూపడంతో తేజ కోరిక నెరవేరలేదు..
దాంతో చేసేదేమీ లేక నైజాం డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న సుధాకర్ రెడ్డి కొడుకు నితిన్ ను తీసుకొచ్చి జయం సినిమాను తెరకెక్కించాడు. నితిన్ కూడా తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: