బాలీవుడ్ హీరోలపై వర్మ సెటైరికల్ కామెంట్స్ వైరల్...!!
అయితే అజయ్ దేవగన్ , సుదీప్ కిచ్చ ట్వీట్ గొడవల పై స్పందిస్తూ వర్మ తనదైన శైలిలో సెటైర్ చేయడం జరిగింది. ఇక రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ సుధీర్ సార్ మీరు ఒక విషయాన్ని తప్పకుండా గ్రహించాలి. ఇటీవల కన్నడ డబ్బింగ్ చిత్రం అయినటువంటి కే జి ఎఫ్ టు సినిమా విజయంతో దక్షిణాది హీరోలు అంటే ఉత్తరాది స్టార్లకు అభద్రతా భావం అలాగే జెలసీ ఏర్పడింది. కే జి ఎఫ్ 2 సినిమా మొదటి రోజు హిందీలో రూ.50 కోట్లు సంపాదించి ఇండస్ట్రీ హిట్ కొట్టింది.. హిందీ సినిమాల ఓపెనింగ్ మన సౌత్ హీరోలు కూడా చూడడం ఖాయం అంటూ తనదైన శైలిలో వర్మ సెటైర్ వేశాడు.
అంతే కాదు సుదీప్ అలాగే అజయ్ దేవగన్ ఒకరికి ఒకరు తప్పు తెలుసుకొని ట్వీట్ ద్వారా క్షమాపణలు చెప్పుకోవడం తో ఈ ట్వీట్ పై స్పందిస్తూ ప్రాంతీయం, సంస్కృతి అనే సరిహద్దులను దాటుకుని భాషలు కూడా వచ్చేసాయి. మనమంతా సమైక్యంగా ఉండాలి కానీ దూరం కాకూడదు , గొడవలు వద్దు అంటూ ఇద్దరు హీరోలకు హితవు పలికారు వర్మ.