చిరంజీవి విషయమై రాజమౌళికి క్లారిటీ !
అదేవిధంగా రాజమౌళి కూడ చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా సంభోదిస్తూ అతడి పై తన ప్రేమను కురిపిస్తున్నాడు. దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చే ఆస్కారం ఉందని ఆసినిమాను ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది అంటూ ఊహాగానాలు కూడ మొదలైపోయాయి. లేటెస్ట్ గా చిరంజీవి ‘ఆచార్య’ ను ప్రమోట్ చేస్తూ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి రాజమౌళి ల కాంబినేషన్ మూవీ గురించి ప్రస్తావన వచ్చింది.
ఈవిషయమై మెగా స్టార్ స్పందిస్తూ ఇది కేవలం రూమర్ మాత్రమే అని అంటూ ఒకవేళ రాజమౌళి తనతో సినిమా చేస్తానని ముందుకు వచ్చినా తాను రాజమౌళితో సినిమా చేయను అని స్పష్టంగా చెప్పేస్తాను అని అన్నాడు. రాజమౌళి సినిమాలో హీరో అంటే విపరీతంగా కష్టపడాలి అనీ ఆయన ఎంచుకునే కథలు పాత్రలు అలా ఉంటాయి కాబట్టి తాను నటుడుగా 150 సినిమాలకు పైగా నటించినా తాను తన అనుభవంతో రాజమౌళిని సంతృప్తి పరచలేను అని కామెంట్స్ చేసాడు.
తన భవిష్యత్ ప్రణాళికలు గురించి వివరిస్తూ తాను కనీసం ఒక్క సినిమాకైనా డైరెక్ట్ చేయాలని కోరిక ఉందని ఆకోరిక ఎప్పుడు తీరుతుందో తనకు తెలియదు అని అంటున్నాడు. అంతేకాదు తెలుగు సినిమా రంగంలోని వివిధ రంగాలకు చెందిన కార్మికులకు ఒక హాస్పటల్ కట్టి వారందరికీ ఉచితంగా వైద్యం అందించాలని తన కోరిక అంటూ ఇది ఖచ్చితంగా చేసి తీరతాను అని అంటున్నాడు. అయితే నేటి తరం అభిరుచులకు తగ్గట్టుగా చిరంజీవి డైరెక్ట్ చేయబోయే సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి..