ఆచార్య ఎందుకు ఫెయిల్ అయ్యింది !

Seetha Sailaja
45 సంవాత్సరాలుగా ప్రేక్షకులకు బోర్ కొట్టని చిరంజీవి ఫేస్ ‘ఆచార్య’ లో ఎందుకు బోర్ కొట్టింది అన్నది ఇండస్ట్రీలో తలలు పండిన సినిమా విశ్లేషకులకు కూడ అంతుచిక్కడం లేదు. చిరంజీవి సినిమా ఫెయిల్ అయినప్పటికీ మొదటిరోజు నాలుగు షోలు ఫుల్ అయితీరతాయి. అయితే తెలుగు రాష్ట్రాలలోని కొన్ని ధియేటర్లలో ‘ఆచార్య’ కొన్ని చోట్ల 20 నుంచి 30 శాతం సీట్లు ఖాళీగా ఉన్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.


ఈపరిస్థితి ‘ఆచార్య’ కు ఎందుకు వచ్చింది అంటూ అప్పుడే చర్చలు జరుగుతున్నాయి. సాధారణంగా సగటు ప్రేక్షకులకు చిరంజీవి డాన్స్ లు బోరుకొట్టవు. అయితే ‘ఆచార్య’ మాత్రం తనకు బోర్ కొట్టింది అని సగటు ప్రేక్షకుడు అంటున్నాడు. న‌క్స‌లిజం అమ్మ‌వారి మ‌హ‌త్యం గిరిజ‌న సంక్షేమం ఆయుర్వేదం లాంటి ఎన్నో మాస్ మసాలా అంశాలు ‘ఆచార్య’ లో ఉన్నా సగటు ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడం లేదు.



‘ఆచార్య’ మూవీ ప్రారంభంలో మహేష్ వాయస్ ఓవర్ దగ్గర నుండి సగటు ప్రేక్షకుడుకి కన్ఫ్యూజన్ మొదలైంది. ధ‌ర్మ‌స్థ‌లి పాద‌ఘ‌ట్టం జీవ‌ధార‌ గుడి అమ్మ‌వారు ఇలా రకరకాల పదాలు మహేష్ వాయస్ ఓవర్ లో ఉన్నా మాస్ ప్రేక్షకులకు ఏదీ అర్థం కాలేదు. గుడి ముందే మ‌ర్డ‌ర్లు జ‌రుగుతుంటే వాటిని అమ్మవారు ఆపలేకపోయినా అమ్మవారు పంపిన దూతగా చిరంజీవి విలన్స్ ను ఊచకోత కోసినా సగటు ప్రేక్షకుడులో ఎటువంటి స్పందనా లేదు. రొటీన్ కథలా సాగుతున్న ఈమూవీలో అసలు చరణ్ పాత్రతతో ఎందుకు ఉపకథ పెట్టారో ఎవరికీ తెలియని పరిస్థితి.


న‌క్స‌లైట్ల బృందం మ‌ధ్య రెజీనా ఐటం సాంగ్ చేస్తుంటే నక్సలైట్లు ఇలా ఎంజాయ్ చేస్తారా అన్న సందేహాలు కూడ చాలామందికి వస్తాయి. శ‌త్రువుకు అయినా వైద్యం చేసే మంచి భావాలు ఈసినిమాలో ఎన్నో ఉన్నప్పటికీ స్వతహాగా కమ్యునిస్ట్ అయిన కొరటాల శివ ఇలా అర్థంకాని నక్సలైట్ భావజాల ప్రయోగంతో ఎందుకు తప్పటడుగు వేసాడు అన్నది ఎవరికీ అర్థం కాని ప్రశ్నంగా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: