అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్, రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం అలాగే కీర్తి సురేష్ తన అందచందాలతో, నటనతో ఈ మూవీ లో అలరించడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో నేను శైలజ మూవీ మంచి గుర్తింపు ను లభించింది. మొదటి సినిమా నేను శైలజ తోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత మహానటి సినిమా ద్వారా ఎనలేని పేరు ప్రతిష్టలను సంపాదించుకుంది.
అలాగే నేను లోకల్ వంటి కమర్షియల్ హంగులతో కూడిన సినిమాలలో కూడా కీర్తి సురేష్ తన నటనతో ప్రేక్షకులను అలరించింది. కమర్షియల్ సినిమాలలో , లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న కీర్తి సురేష్ తెలుగు తో పాటు తమిళ భాషలో కూడా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు మరియు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది.
ఇలా ఫుల్ బిజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న కీర్తి సురేష్ మరి కొన్ని రోజుల్లో తను ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా సాని కాయిధం తో ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ సినిమానే తెలుగులో చిన్ని పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' లో మే 6 వ తేది నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ , మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో కథానాయికగా నటించింది. ఈ సినిమా మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఇలా వరుస పెట్టి కీర్తి సురేష్ తన సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతోంది.