షాక్: బిగ్ బాస్ రియాల్టీ షోపై.. హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు..!!
అప్పటి నుంచి ఇది విచారణ నోచుకోకపోవడంతో నిన్న రోజున పిటిషన్ తరఫున న్యాయవాది శివప్రసాద్రెడ్డి దీనిపై విచారణ జరపాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో బిగ్ బాస్ షో పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షోలో అశ్లీలత, అసభ్యత ను ప్రోత్సహించే విధంగా ఉందని అలాగే యువత పక్కదారి పట్టేందుకు వీలుందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ బిగ్ బాస్ షో పై దాఖలైన ఈ పిటిషన్పై హైకోర్టు స్పందిస్తూ. మంచి ఫీల్ వేశారంట పిటిషనర్ ను ప్రశంసించిందట.
ఈ కేసును సోమవారం విచారిస్తామని వెల్లడించింది. ఇక హైకోర్టు కూడా యువత పక్కదారి పడుతోందని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీని వల్ల ఎంతోమంది సమాజంలో అశ్లీలత పెరిగిపోతున్నట్లుగా తెలియజేశారు. ఇక ఇలాంటి షోలపై జోక్యం చేసుకోవాలని జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా, మరొక జస్టిస్ రాజశేఖరరావు తెలియజేశారు. అయితే మా పిల్లలు బాగున్నారని, ఇలాంటి షోలకు మాకు ఎలాంటి సంబంధం లేదని ప్రజలు అనుకుంటూ ఉంటారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్య ఎదురవుతుందని.. ఇక అప్పుడు వారు కూడా పట్టించుకోరని హైకోర్టు తెలియజేసింది. ఇక తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేయడం జరిగింది.A