బాలకృష్ణ మూవీకి సుల్తాన్ ఛాయలు !

Seetha Sailaja

‘అఖండ’ సూపర్ సక్సస్ తరువాత బాలకృష్ణ తన సినిమాల వేగం పెంచాడు. యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో లేటెస్ట్ గా ఒక మూవీ చేస్తున్నాడు. ఈమూవీలో బాలయ్య డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపిస్తాడు అన్నప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈసినిమాకు సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ ఫిలిం సర్కిల్స్ ద్వారా లీక్ అయింది.


బాలకృష్ణ ఇప్పటివరకు 150 సినిమాలకు పైగా నటించినప్పటికీ ఇప్పటివరకు అతడి కెరియర్ లో నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలలో చాల తక్కువగా నటించాడు. వాస్తవానికి బాలయ్యకు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించడం అంటే చాల ఇష్టం. అయితే అలాంటి పాత్రలు చాల అరుదుగా బాలయ్యకు వచ్చాయి. ఇప్పుడు గోపీచంద్ మలినేని బాలయ్యను తన మూవీలో చాల కాలం తరువాత మళ్ళీ నెగిటివ్ షెడ్ లో చూపిస్తున్నట్లు టాక్.


తెలుస్తున్న సమాచారంమేరకు గోపీచంద్ మలినేని మూవీలో బాలయ్య పోషించే పాత్ర 1999లో వచ్చిన బాలకృష్ణ నటించిన ‘సుల్తాన్’ మూవీ ఛాయలలో ఉంటుందని టాక్. ఈమూవీలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసాడు. అతడు పోషించిన రెండు పాత్రలలో ఒకటి విలన్ పాత్ర ఆపాత్ర క్లైమాక్స్ ముందు మంచిగా మారి చనిపోతుంది.


అయితే ఆమూవీ ఫ్లాప్ కావడంతో తిరిగి బాలకృష్ణ అలాంటి పాత్రల వైపు ఆశక్తి కనపరచలేదు. ఇప్పుడు గోపీచంద్ మలినేని డిజైన్ చేసిన నెగిటివ్ పాత్ర బాలకృష్ణకు నచ్చడంతో అతడు మళ్ళీ నెగిటివ్ పాత్రను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ నెగిటివ్ పాత్రకు సంబంధించిన లుక్ లీక్ కావడంతో ఆ లుక్ నేటితరం ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈమూవీలో వరలక్ష్మి కూడ మరొక నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలో కనిపించబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతోంది. ఈమూవీలో బాలకృష్ణ పక్కన శృతి హాసన్ నటించడం ఒక విశేషం అయితే దాదాపు 23 ఏళ్ల తర్వాత బాలయ్య విలన్ గా కనిపిస్తూ ఉండటం మరొక ట్విస్ట్. ప్రముఖ కన్నడ స్టార్ దునియా విజయ్ ఈమూవీలో కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: