హీరో అజిత్ సీక్రెట్స్ గురించి మీకు తెలుసా?
తమిళంలో 60కి పైగా సినిమాలు చేశాడు. తమిళంలో శ్రీదేవితో కలిసి ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాకి పనిచేశారు. అజిత్ కుమార్‌కు దక్షిణ భారత చిత్రాలకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకున్న విషయం అందరికి తెలిసిందే..అంతేకాదు మూడు సార్లు సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డు కూడా దక్కించుకున్నాడు..ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఆసక్తి కర విషయాలు మీ కోసం..
అంత పెద్ద హీరోగా రెండు చేతులా సంపాదిస్తున్నారు.. ఆయన కూడా చాలా సింపుల్ గా ఉంటాడు. కనీసం ఒక చైన్ కూడా వేసుకోడు.అతను ఎప్పుడూ ఉంగరం తప్ప వేరే వాటిని ధరించకపోవడానికి ఇదే కారణం. అవును, అజిత్ తన భార్య షాలిని బహుమతిగా ఇచ్చిన ఉంగరం మాత్రమే చేతికి పెట్టు కుంటాడు. ఆ ఉంగరాన్ని ఎప్పుడూ తియ్యడు..
అజిత్ కు రేస్ లు అంటే యమ ఇష్టం..అందుకే ఎప్పుడూ ఏదొక రేస్ లో పాల్గొంటాడు.జాతీయ, అంతర్జాతీయ రేస్ లలో పాల్గొన్నారు.ఏరో మోడలింగ్‌పై కూడా ఆసక్తి చూపిస్తుంటాడు. ఇది హాబీగా చేస్తుంటాడు. పైలట్ లైసెన్స్ కూడా కలిగి ఉన్నాడు..మరో విషయం ఏంటంటే అజిత్ కు పుస్తకాలు చదివే అలవాటు కూడా వుంది.ఎంత బిజీగా ఉన్నా ఏదొక బుక్ ను చదువుతాడు.సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు బహుమతిగా ఇచ్చిన ‘లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్’ తన అభిమాన పుస్తకంగా చెబుతాడు.
ఇకపోతే ఫోటోలు తియ్యడం అన్నా అజిత్ కు చాలా ఇష్టం.ఎక్కడికి వెళ్లినా తన కెమెరాను తీసుకెళ్లడం అలవాటు. తన ‘వీరమ్’ సినిమా షూటింగ్ సమయంలో, అజిత్ తన సహనటుల చిత్రాలను కూడా క్లిక్ చేసి, ఈ ఫోటోలను అందరికి గిఫ్ట్ గా పంపాడు.తన కెరియర్ ఆరంభంలో మెకానిక్ గా పని చేశాడు. సినిమా లలో మంచి సక్సెస్ రావడంతో అటు వైపు వెళ్ళలేదు..ఒక పెద్ద హీరో అయిన కూడా సాదా సీదా మనిషిలాగా ఉంటూ జనాల్లొ మంచి అభిమానాన్ని చూరగొన్నాడు. ఇలాగే ఎప్పుడూ ఆయురారోగ్యా లతో వెయ్యి సినిమాలకు పైగా చేయాలని కోరుకుంటూన్నాము.. హ్యాపీ బర్త్ డే అజిత్..