పవన్, తేజుల మూవీ సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనా?
అది కూడా మళ్ళీ మెగా హీరోల మల్టిస్టారర్ చిత్రం కావడం విశేషం.పవన్‌కల్యాణ్, సాయిధరమ్‌తేజ్.. మామ అల్లుళ్ల కలయికలో కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘వినోదయ సీతమ్’ ను తెలుగులో రూపొందించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. జూన్ లో ముహుర్తానికి కొబ్బరికాయ కొట్టి నిర్విరామంగా సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నారని టాక్. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్రఖని తెలుగు రీమేక్‌కు కూడా డైరెక్టర్ గా చేయనున్నారు. కాగా, తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథలో కొన్ని మార్పులు చేసి ప్రీ ప్రోడక్షన్ పనులను పూర్తీ చేస్తున్నట్లు తెలుస్తుంది.
తమిళంలో ఈ సినిమా ' వినోదయ సీతమ్’ టైటిల్ లో తెరకెక్కుతోంది. అందులో సముద్రఖని, తంబిరామయ్య ప్రధాన పాత్రలలో కనిపించారు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ లు నటించనున్నారు. యాక్సిడెంట్ లో చనిపోయిన ఓ వ్యక్తి మళ్ళీ 90 లో భూమీద ఉండేందుకు అవకాశాన్ని పొందిన తర్వాత ఏం జరిగిందనే నేపథ్యంతో ఈ సినిమా కథ ఉండనుంది. ఇప్పటివరకు రాని కథ.. ఈ సినిమా తప్పక అందరికి నచ్చుతుందని డైరెక్టర్ అన్నారు.బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు.. విమర్శకుల ప్రసంశలు కూడా అందుకుంది. తెలుగులో జీస్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ఇద్దరు మెగా హీరోలు మళ్ళీ ఒకే స్క్రీన్ పై కనిపించడంతో సినిమా పై మెగా ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు..మరి ఆ సినిమా లక్ ఎలా ఉంటుందో చూడాలి..