తమన్నా కు అలా అనిపించుకోవడం ఇష్టం లేదట..!!
తమన్నా కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రల్లో కూడా నటిస్తూ తనని తాను నిరూపించుకుంటోంది. ప్రతి సంవత్సరం ఎంతోమంది కొత్త కథానాయకులు వస్తున్నప్పటికీ వారికి పోటీ ఇస్తూ ముందుకు వెళుతోంది. తాజాగా తమన్నా నటించిన ఎఫ్ 3 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. బోళా శంకర్ సినిమాలో కూడా చిరంజీవి సరసన నటిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈమె అనేక విషయాలను తెలియజేసింది. తన ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికి చాలా కాలం అవుతోంది. చూస్తూ ఉండగానే సీనియారిటీ మొత్తం పెరిగిపోతోంది. సీనియారిటీ అనేది ఒక బాధ్యత వంటిది అని తెలియజేసింది.
కానీ ప్రస్తుతం ఇప్పుడు ఎంచుకునే పాత్రల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఒకవేళ పాత్రలు సరిగ్గా లేకపోతే తమన్నా ఇలాంటి పాత్ర చేస్తోంది ఏమిటి అని అందరితో అనిపించుకోవడం తనకు ఇష్టం లేదని తెలియజేసింది. తను నటించే పాత్ర వల్ల తన స్థాయి పడిపోకూడదు అని తెలియజేసింది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో కాలం అవుతున్నప్పటికీ ఇంతవరకు తను చేయాలనుకున్న పాత్రను చేయలేదని తెలియజేసింది. ఇక ఆలాంటి పాత్రలు ఎప్పుడు వస్తాయి అంటూ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను.. దాని పూర్తి స్థాయిలో ఆవిష్కరించే సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను తెలియజేసింది.