టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా సర్కారు వారి పాట. ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రమోషన్లు చేసుకోవడానికి రెడీ అవుతుంది. మే 12వ తేదీన ఈ సినిమా విడుదల కావడంతో రేపు ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. ఈ ప్రయత్నంలోనే సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేయాలని వారు భావిస్తున్నారు. మహేష్ కూడా ట్రైలర్ లాంచ్ నుండే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనబోతున్నాడు అని చెబుతున్నారు.
తన ప్రతి సినిమాను కూడా మీడియా ముందుకు తీసుకు వచ్చి ఎంతో స్పెషల్ గా అద్భుతంగా ప్రమోట్ చేస్తూ ఉంటాడు. అలా ఈసారి కూడా ఏ మాత్రం తగ్గకుండా ముందుకు వెళుతున్నాడు. చెప్పాలంటే గతంలో కంటే ఎక్కువగా ఈ సారి మరింత జాగ్రత్త తీసుకుని ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. మే మొదటి వారం అంతా ప్రమోషన్స్ కోసమే తన టైం కేటాయిస్తాడట. ఆ తర్వాత తదుపరి సినిమాల షూటింగ్ లకు వెళ్ళపోతున్నాడు.
మే 10వ తారీఖు వరకు ఇంటర్వ్యూలు మీడియాతో ఇంటరాక్షన్స్ సోషల్ మీడియాలో వచ్చేలా ఆయన ప్లాన్ చేస్తున్నారు. అలాగే కొంతమంది ఇతర దర్శకులతో ఇంటర్వ్యూలు ఇలాంటివి ప్లాన్ చేస్తున్నారు. ఒక భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసి మహేష్ బాబు ఈ సినిమా క్రేజ్ ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఈ సినిమా రిలీజ్ వరకు తన శర్క్తి మేరకు కోసం ప్రమోషన్ చేసి మంచి ప్రమోషన్ చేయబోతున్నాడు. క్రేజ్, స్టార్దమ్ అనేది పక్కనపెట్టి మీడియా ముందుకు వచ్చి అందరికీ ఇంటర్వ్యూ ఇస్తూ సరదాగా ఉంటాడు మహేష్. రిలీజ్ కు ముందు ప్రమోషన్ తప్పా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏదీ ఆలోచించడు. ఆ తర్వాతే ప్లాన్ చేసుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ మీడియాకి కనబడు. అలా ప్రమోషన్ విషయంలో మహేష్ ను మించిన వారు లేరంటే నమ్మాల్సిందే. మరి ఈసారి ఎలాంటి వినూత్నమైన ప్రమోషన్ కార్యక్రమాలను మహేష్ చేస్తాడో చూడాలి.