మహేష్ తాళాల గుత్తి పై సెటైర్లు !
దీనితో ఈ తాళాల గుత్తి కూడ ఈమూవీలో కీలక పాత్ర పోషిస్తుందని సంకేతాలు వస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీ కథ ప్రకారం మహేష్ తన తండ్రి సమస్యలలో చిక్కుకున్నప్పుడు మహేష్ విదేశాల నుండి వస్తాడు. ఇలా తండ్రి కోసం లేదా కుటుంబం కోసం హీరోలు విదేశాల నుండి వచ్చి ఆ సమస్యలను చక్కదిద్దిన సినిమా కథలు గతంలో చాల వచ్చాయి. దీనితో మహేష్ ‘సర్కారు వారి పాట’ మూవీ కథ పాత చింతకాయ పచ్చడి కథా అంటూ ఊహాగానాలతో పాటు సెటైర్లు కూడ మొదలైపోయాయి.
సాధారణంగా టాప్ హీరోలు కత్తి గొడ్డలి తుపాకి త్రిశూలం పట్టుకుని ఉంటారు కాబట్టి పరశురామ్ వెరైటీ కోసం ఇలా మహేష్ చేతికి తాళాలు గుత్తి ఇచ్చాడా అంటూ సెటైర్లు మొదలైపోయాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న మహేష్ మరో రెండురోజులలో హైదరాబాద్ తిరిగి వచ్చి ఈమూవీ ప్రమోషన్ కోసం సుమారు 10రోజులు పైగా కష్టపడతాడని టాక్. మహేష్ తో పాటు అన్ని ఇంటర్వ్యూలలోనూ కీర్తి సురేష్ కూడ ఉంటుందట.
బ్యాంక్ స్కాం కథకు మహేష్ కు సంబంధించి హీరోయిజం ఎలివేషన్ ఇస్తూనే పరుశురామ్ మార్క్ లో ఉండే కామెడీ టచ్ ఈమూవీలో ప్రధానంగా ఉంటుంది అంటున్నారు. ‘ఆచార్య’ ఫ్లాప్ అయింది కాబట్టి ఒక ఫ్లాప్ సినిమా తరువాత విడుదల అయ్యే మరొక భారీ సినిమాను సగటు ప్రేక్షకులు విపరీతంగా చూస్తారు..