'హిట్ 2' విడుదల తేదీని కన్ఫామ్ చేసిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
విశ్వక్ సేన్ హీరో గా నాని నిర్మాతగా తెరకెక్కిన    'హిట్ .. ది ఫస్టు కేస్' సినిమా 2020 లో థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే.  శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అయింది. ఈ మూవీ లో విశ్వక్ సేన్ తన నటనతో ప్రేక్షకులను బాగానే మెప్పించాడు. ఈ సినిమా పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కింది మంచి విజయాన్ని అందుకుంది. హిట్ .. ది ఫస్టు కేస్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఆ మూవీ కి  సీక్వెల్‌ గా ఇప్పుడు నాని 'హిట్ 2 ది సెకండ్ కేస్' మూవీ ని  నిర్మిస్తున్నాడు.


కొన్ని రోజుల క్రితం ఈ మూవీ కి సంబంధించిన ఫస్టు గ్లింప్స్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్టు గ్లింప్స్‌ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ లో అడవి శేషు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. అడవి శేషు ఈ సినిమా లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీ ని దర్శకుడు సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా హిట్ ది సెకండ్ కేస్ మూవీ నుండి చిత్ర బృందం ఒక అప్డేట్ బయటకు వదిలింది.  


తాజాగా ఈ చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేస్తూ హిట్ 2 ది సెకండ్ కేస్ మూవీ ని జూలై 29 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. హిట్ .. ది ఫస్టు కేస్ మూవీ  మంచి విజయం సాధించడంతో హిట్ 2 ది సెకండ్ కేస్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి హిట్ 2 ది సెకండ్ కేస్ మూవీ ఎ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: