అసలు నాగార్జునకి ఏమైంది... అలా డీలా పడిపోయాడేంటి?

VAMSI
అమ్మాయిల కలలు రాకుమారుడిగా పేరున్న అక్కినేని నాగార్జున వయసు మీద పడుతోంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నటుడిగా టాలీవుడ్ లో తనకంటూ ఒక బ్రాండ్ ను తెచ్చుకుని ఇప్పటికీ హీరోగా రాణిస్తున్నాడు. ఒక హీరోగానే కాకుండా నిర్మాతగా, టీవీ హోస్ట్ గా కూడా తాను ఎంత సక్సెస్ అయ్యాడో తెలిసిందే. అయితే తాజాగా నాగార్జున గురించి ఒక విషయం వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే... బుల్లితెర యాంకర్ గా తన కంటూ ప్రత్యేకమైన స్టార్ డం ను సంపాదించుకున్న సుమ కనకాల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె తాజాగా నటించిన సినిమా జయమ్మ పంచాయితీ. ఇందులో సుమ ప్రధాన పాత్ర పోస్తున్నారు. ఈ వారంలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది, అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నాగార్జున విచ్చేశారు. అయితే ఇందులో ఉన్నంతసేపు నాగార్జున ముఖంలో కాస్త చిరు నవ్వు లేదు. మాటల్లో పవర్ లేదు. ఎందుకో పూర్తిగా డీలా పడిపోయాడు. ఈ ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఎందుకు నాగార్జున ఇలా ఉన్నాడు ? ఏమైంది అంటూ కంగారు పడుతున్నారు. అయితే దీనిపై పలు కారణాలు బయటకు వస్తున్నాయి. నాగార్జున బాధంతా నాగ చైతన్య లైఫ్ గురించే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సమంత తో విడాకుల అనంతరం నుండి నాగార్జున ఈ విధంగా మారిపోయాడని, ఎప్పుడూ ఈ విషయమే ఆలోచిస్తూ లోలోపల కృంగిపోతున్నాడని తెలుస్తోంది.

 మళ్ళీ నాగచైతన్యకు పెళ్లి చేసే వరకు మనశ్శాంతి లేదని పలువురికి చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి నాగార్జున అలా ఉండడానికి కారణం ఇదేనా లేదా ఇంకేమైనా ఉందా అన్నది తెలియాలంటే  మరి కొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నఉరు నెటిజన్లు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: