రాజమౌళికి కీరవాణి వెన్నుపోటు.. అసలు కథ ఇది?

praveen
దర్శక ధీరుడు రాజమౌళి స్టార్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులందరికీ ఎంత ఫేవరెట్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజమౌళి ఏ సినిమా తెరకెక్కించిన ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తూ ఉంటాడు. అంతేకాదు ఇక కీరవాణి అద్భుతమైన మ్యూజిక్ అందిస్తూ రాజమౌళి సినిమాకి ప్రాణం పోస్తూ ఉంటాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే అటు ప్రేక్షకులు కూడా రాజమౌళి ఏదైనా సినిమా తీస్తున్నాడు అంటే కీరవాణిని తప్ప మరో మ్యూజిక్ డైరెక్టర్ ని ఊహించుకో లేరు అని చెప్పాలి.



 అయితే కేవలం రాజమౌళి సినిమాలకు మాత్రమే కాదు ఇంకా ఎన్నో సినిమాలకి కూడా మంచి మ్యూజిక్ అందించి తన మ్యూజిక్ తో ఎంతో మంది శ్రోతలను అలరించారు కీరవాణి. ఇండస్ట్రీలో ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్ లు ఉన్న కీరవాణి అందించిన మ్యూజిక్ మాత్రం ఎప్పుడూ ప్రత్యేకం అని చెప్పాలి. అయితే ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అటు దర్శక ధీరుడు రాజమౌళి ని వెన్నుపోటు పొడిచాడూ. రాజమౌళిని మాత్రమే కాదు ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా వెన్నుపోటు పొడిచారు.అదేంటి కీరవాణి వెన్నుపోటు పొడవడం ఏంటి.. అని షాక్ అవుతున్నారు కదా.


 అసలు స్టోరీ ఏంటి అంటే.. ఇటీవల సుమ ప్రధాన పాత్రలో నటించిన జయమ్మ పంచాయతీ అనే సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందించాడు అనే విషయం తెలిసిందే.. కీరవాణి అందించిన పాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల క్యాష్ షో లో ఎంట్రీ ఇచ్చాడు కీరవాణి. ఈ క్రమంలోనే కీరవాణి నా సినిమాకు మ్యూజిక్ అందించడమే గొప్ప అనుకుంటే.. ఇప్పుడు ప్రమోషన్స్ నిర్వహించడానికి నా షోలోకి కూడా వచ్చేసారు. రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా కూడా ఆయన ఇంటర్వ్యూకు వెళ్లి ఉండకపోవచ్చు.. ఇక కీరవాణి రాజమౌళి ని వెన్నుపోటు పొడిచాడు అంటూ సుమ అంటుంది. దీంతో బాహుబలిలో ని వెన్నుపోటు ఫోటో ని మార్ఫింగ్ చేసి కీరవాణి రాజమౌళి ఎన్టీఆర్ చరణ్ లను వెన్నుపోటు పొడుస్తున్న ఒక ఫోటో ప్లే చేస్తారు. ఇది చూసి అందరూ నవ్వుకుంటారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: