ఫర్ ద ఫస్ట్ టైమ్.. క్యాష్ షోలో ఆయనొచ్చారు?
ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక సుమ ప్రమోషన్స్ లో భాగంగా ఎంతో బిజీగా ఉంది. ఒకవైపు తాను ఎప్పుడూ చేసే షో లకు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు ఇక ప్రమోషన్స్ కూడా 25 నిర్వహిస్తుంది యాంకర్ సుమ. ఈ క్రమంలోనే ఇటీవల తాను హోస్ట్ చేస్తున్న క్యాష్ షో లో భాగంగా తన సినిమాకి తానే ప్రమోషన్స్ చేసుకుంది. ఈ క్రమంలోనే జయమ్మ పంచాయతీ సినిమాలో పాటలు పాడిన సింగర్ మనో, గీతా మాధురి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఫర్ ద ఫస్ట్ టైం క్యాష్ షో లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు అని చెప్పాలి.
ఇక అందరూ మామూలుగానే ఎంట్రీ ఇస్తే అటు కీరవాణి మాత్రం స్పెషల్ ఎఫెక్ట్స్ మధ్య ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇలా ఎంట్రీ ఇచ్చి సైలెంట్ గా ఊరుకోలేదు. ప్రతిసారి యాంకర్ సుమ తన పంచులతో షోని నడిపిస్తూ ఉంటే.. ఇక ఇటీవల విడుదలైన ప్రోమో మాత్రం ఏకంగా కీరవాణి తన పంచులతో షో మొత్తాన్ని సందడి సందడి గా మార్చేసాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కీరవాణి స్పాంటేనియస్ పంచలు చూసి అభిమానులు సైతం అవాక్కవుతున్నారు. ఇక ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా తప్పకుండా చూడాల్సిందే అని అనుకుంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు.