విశ్వక్ సేన్ అతి దేనికి సంకేతం !

Seetha Sailaja
ఒక సినిమాను జనంలోకి తీసుకువెళ్ళడానికి అనేక మార్గాలు అనుసరించవలసిన పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో ఎదో ఒక సంచలనం ఉంటే కాని ఆసినిమాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనితో ఏదో ఒకవిధంగా న్యూస్ లోకి రావడానికి చిన్న సినిమాల దర్శకులు అదేవిధంగా హీరోలు ప్రస్తుతం నానాపాట్లు పడుతున్నారు.


యంగ్ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ‘విశ్వక్ సేన్’ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఫ్యామిలీ ప్రేక్షకుల సపోర్ట్ లేకుండా కేవలం యూత్ ప్రేక్షకుల సపోర్ట్ తో హీరోలు నిలబడలేరు అన్న వాస్తవాన్ని గ్రహించిన ‘విశ్వక్ సేన్’ తన లేటెస్ట్ మూవీ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు.

ఈ సినిమాను డిఫరెంట్ గా ప్రమోషన్ చేయాలన్న ఉద్దేశ్యంతో ‘విశ్వక్ సేన్’ డిజైన్ చేసిన ఒక ఓవర్ యాక్షన్ డ్రామా అతడి పై విమర్శలు వచ్చేలా చేయడంతో ఈ యంగ్ హీరోకి ఇంత అతి ఏమిటి అంటూ విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి. నడిరోడ్డు మీద ‘విశ్వక్ సేన్’ క్రియేట్ చేసిన ఓవర్ యాక్షన్ డ్రామా ఈసినిమాకు ఎంతవరకు కలక్షన్స్ తెచ్చిపెడుతుందో తెలియదు కానీ అనవసరంగా మీడియా వర్గాలలో అదేవిధంగా ఇండస్ట్రీ వర్గాలలో ‘విశ్వక్ సేన్’ పై నెగిటివ్ కామెంట్స్ వచ్చే స్థాయికి అతడి ప్రవర్తన వెళ్ళిపోయింది.


ఈ యంగ్ హీరో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నాడు అంటూ అతడి పై కేసులు పెట్టాలని కొంతమంది కోరడంతో పాటు ఆవిధంగా ప్రయత్నాలు జరిగే స్థాయిలో అనవసరపు రగడ ఈ యంగ్ హీరో పై వస్తూ ఉండటంతో ఈ వ్యవహారాన్ని ఇండస్ట్రీ వర్గాలు నిశితంగా పరిశీలిస్తూ ‘విశ్వక్ సేన్’ కు అతి ఎక్కువైందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరైతే ఇండస్ట్రీలో ఏమాత్రం పూర్తిగా సెటిల్ కాని ఈ యంగ్ హీరోకు ఇంత అత్యుత్సాహం అవసరమా అంటూ ఇండస్ట్రీలో మరికొందరు ఆశ్చర్యపోతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: