చిరంజీవి చరణ్ లు త్యాగం చేయక తప్పదా ?

Seetha Sailaja

‘ఆచార్య’ విడుదలకు ముందు ఈ మూవీ కనీసం 200 వందల కోట్లు కలక్షన్స్ వసూలు చేస్తుందని అంతా అనుకున్నారు. చిరంజీవి చరణ్ కొరటాల ల మ్యాజిక్ కాంబినేషన్ కాబట్టి ఆ ఫిగర్ చేరుకోవడం చాల సులువైన పని అని అంతా అనుకున్నారు అయితే జరిగింది వేరు.


ఈ మూవీ వీకెండ్ ముగిసే సరికి కనీసం 50 కోట్ల నెట్ కలక్షన్స్ కూడ వసూలు చేయలేకపోయింది అన్న వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల అంచనాల ప్రకారం ఈమూవీ పై సుమారు 140 కోట్ల బిజినెస్ జరిగింది అంటున్నారు. ఈ మూవీ బయ్యర్లకు తాము పెట్టిన పెట్టుబడిలో కనీసం 50శాతం కూడ రాని పరిస్థితి ఏర్పడింది అంటున్నారు.


దీనితో బయ్యర్లను ఆడుకోవలసిన పరిస్థితి ఈసినిమా నిర్మాత పై పడింది అన్న లీకులు వస్తున్నాయి. చిరంజీవి ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్నాడు. ఇండస్ట్రీలోని ప్రతి సమస్య చిరంజీవి దృష్టి వరకు రావడంతో వాటిని మెగా స్టార్ తన పెద్దరికంతో పరిష్కరిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఈమూవీ బయ్యర్లు ఖచ్చితంగా చిరంజీవిని కలిసి తమ తీవ్ర నష్టాలను వివరించే ఆస్కారం ఉంది అన్న లీకులు వస్తున్నాయి. అదే జరిగితే చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఏమి చేస్తాడు అన్న సందేహం అందరిలోనూ ఉంది.


ఈమూవీకి రామ్ చరణ్ కూడ సహ నిర్మాతగా వ్యవహరించాడు. దీనితో చిరంజీవి స్పందించవలసిన పరిస్థితి అంటున్నారు. ఈ మూవీకి చిరంజీవి రామ్ చరణ్ లతో పాటు కొరటాల కూడ పారితోషికం తీసుకోలేదు అంటూ ఓపెన్ గానే చెప్పారు. దీనితో వీరి పారితోషికాలను పక్కకు పెట్టి ముందు బయ్యర్లను ఆదుకోమని ఒత్తిడి వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు. అలా జరగకపోతే లైన్ లో ఉన్న చిరంజీవి భవిష్యత్ సినిమాల మార్కెట్ పై ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీ పెద్ద హోదాలో చిరంజీవి ‘ఆచార్య’ బయ్యర్లకు ఎదోఒకటి చేసి తీరుతాడు అంటూ ఊహాగానాలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: